Monalisa: మోనాలిసా గొప్ప మనసుకు జనం ఫిదా..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో పూసలు అమ్ముకుని వైరల్ అయిన మోనాలిసా సోషల్ మీడియాలో మరింత హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా.. ఆమె వాళ్ల అమ్మకి బంగారు గొలుసు గిప్ట్‌గా ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఓ చిన్న పల్లెటూరు నుంచి పూసలు అమ్ముకోవడానికి ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వచ్చిన మోనాలిసా..
తన తేనె కళ్లు, అందం, చిరునవ్వుతో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె ఫొటోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా రాత్రికి రాత్రే వైరల్‌గా మారి సెలబ్రిటీగా మారింది. ఆ తర్వాత.. ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు కుంభమేళాకు వచ్చిన ప్రజలు ఎగబడ్డారు. ఆ తర్వాత రెండు మూడు రోజులపాటు సోషల్ మీడియా అంతా మోనాలిసా ఫొటోలు, వీడియోలతో మారుమోగింది. నెటిజన్లు ఆమె అందాన్ని పొగుడుతూ ప్రశంసలతో ముంచెత్తారు. అయితే.. తన వల్ల కుంభమేళా ప్రతిష్ట దెబ్బతినొద్దని.. ఆమె వ్యాపారాన్ని వదిలేసి సొంతూరుకి వెళ్లిపోయింది. కానీ.. వ్యాపారానికి ఆటంకం కలగడంతో మోనాలిసాకి నెటిజన్లు సపోర్ట్‌గా నిలిచారు. ఈ క్రమంలోనే.. బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ దర్శకుడు ఆమెకి సినిమా ఛాన్స్ ఇస్తూ సంచలన ప్రకటన చేశాడు. మణిపూర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా.. మోనాలిసాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రతిరోజూ పెరుగు తీసుకుంటే జరిగేది ఇదే
బంగారం చిన్న దుకాణంలో మంచిదా.. పెద్ద షోరూమ్‌లో బెటరా..?
Allu Arjun: వావ్! హాలీవుడ్ మ్యాగజీన్‌పై ఐకాన్ స్టార్
Vishwak Sen: లైలా దెబ్బ ధాటికి.. మారిపోయిన హీరో
OTTలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక.. మీరు కూడా ఆ కంటెంట్ చూస్తున్నారా?

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో
