ప్రతిరోజూ పెరుగు తీసుకుంటే జరిగేది ఇదే
సాధారణంగా భోజనం పచ్చడితో మొదలుపెట్టి... పెరుగుతో ముగిస్తారు. పెరుగు లేనిదే భోజనం సంపూర్ణం కాదంటారు. అందుకే చాలామందికి ప్రతిరోజూ భోజనంలో పెరుగు తినడం అలవాటు. పెరుగు తిననిరోజు వారికి భోజనం చేసిన తృప్తి కలుగదు. పెరుగు శరీరానికి మేలు చేసే ప్రోబయోటిక్స్‌ను అందిస్తుంది. పెరుగులో విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి.
అయితే పెరుగు ఎక్కువగా తినడం వల్ల జలుబు చేస్తుందని, రాత్రి పూట అస్సలు తినవద్దని కొందరు పెరుగు తినడానికి సంకోచిస్తారు. అయితే రోజూ పెరుగు తినడం వల్ల మన శరీరంలో వచ్చే మార్పులేమిటి, ఏమేం ప్రయోజనాలు ఉన్నాయి? నిపుణులు చేసే సూచనలేంటో చూద్దాం. పెరుగు రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రణలో ఉంచుతుందని… తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో పెరుగును తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్లు వేగంగా జీర్ణమవకుండా చూస్తుందని… రక్తంలో వేగంగా గ్లూకోజ్ నిల్వలు పెరిగే సమస్య ఉండదని చెబుతున్నారు. పెరుగులో అధికంగా ఉండే కాల్షియం, ఫాస్పరస్ ఎముకలు, దంతాలు దృఢంగా ఉండటానికి తోడ్పడతాయని తెలుపుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు… తరచూ పెరుగు తీసుకోవడం వల్ల ఆస్టియోపొరోసిస్ అంటే ఎముకలు గుల్లబారే ప్రమాదం తక్కువగా ఉంటుందట. జర్నల్ ఆఫ్ ఒబేసిటీ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనాల ప్రకారం… తరచూ పెరుగు తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల వేగం పెరుగుతుంది. కడుపు నిండుగా ఉన్న భావనతో ఆకలి తగ్గుతుంది. ఇది దీర్ఘకాలంలో బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంగారం చిన్న దుకాణంలో మంచిదా.. పెద్ద షోరూమ్‌లో బెటరా..?
Allu Arjun: వావ్! హాలీవుడ్ మ్యాగజీన్‌పై ఐకాన్ స్టార్
Vishwak Sen: లైలా దెబ్బ ధాటికి.. మారిపోయిన హీరో
OTTలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక.. మీరు కూడా ఆ కంటెంట్ చూస్తున్నారా?

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
