Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marco: ఆహాలో దూసుకుపోతున్న మార్కో

Marco: ఆహాలో దూసుకుపోతున్న మార్కో

Phani CH

|

Updated on: Feb 23, 2025 | 10:22 AM

మలయాళీ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ యాక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ “మార్కో”. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాంటి ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయింది. హనీఫ్ అడేని డైరెక్టోరియల్ సినిమాగా ... క్యూబ్ ఎంటర్‌టైన్మెంట్స్, ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్‌ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమా.. డిసెంబర్ 20న వరల్డ్ వైడ్ రిలీజైంది. మల్లూ వుడ్ బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది.

అలాంటి ఈసినిమా తెలుగు వర్షన్ ఇప్పుడు ఆహాలో అందుబాటులోకి వచ్చింది. అందుబాటులోకి రావడమే కాదు.. తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది ఈ మూవీ. తను ఎంతో ప్రేమించే సోదరుడు విక్టర్ ను చంపిన వారిపై మార్కో పగ తీర్చుకునే తీరు హై ఎండ్ యాక్షన్ సీక్వెన్సులతో ఈ సినిమా తెరకెక్కింది. గతేడాది డిసెంబర్ 20న వరల్డ్ వైడ్ రిలీజ్ మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించింది. మార్కో తెలుగులోనూ రిలీజై ఘన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఆహా ఓటీటీ ద్వారా మార్కో సినిమా మరింతమంది మూవీ లవర్స్ కు దగ్గరైంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనీలాండరింగ్ కేసులో బుక్కైన శంకర్.. దాదాపు 10 కోట్ల ఆస్తులు జప్తు

Chhaava: ఛావా సినిమా ఫ్యాన్స్‌కు ప్రభుత్వం బంపర్ ఆఫర్ !