మనీలాండరింగ్ కేసులో బుక్కైన శంకర్.. దాదాపు 10 కోట్ల ఆస్తులు జప్తు
దర్శకుడు శంకర్ పై అక్రమ మనీలాండరింగ్ కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది.ఈ కేసు విచారణలో ఉండగానే తొలి అడుగుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ.10.11 కోట్ల విలువైన ఆయన ఆస్తులను జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. అక్రమ మనీలాండరింగ్‌లో ప్రమేయం ఉందనే ఆరోపణలపై 2022లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శంకర్ కు నోటీసు పంపారు.
ఆ సమయంలో, ఆయన తన న్యాయవాదితో కలిసి ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు హాజరయ్యాడు. దాదాపు 3 గంటలకు పైగా సాగిన ఈ విచారణ అప్పట్లో సంచలనంగా మారింది. శంకర్ గురించి ఆయన ఆస్తుల గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది. ఇక అప్పటి నుంచి నడుస్తున్న ఈ కేసు.. ఇప్పటికీ కంటన్యూ అవుతోంది. శంకర్‌కు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే ఆయన ఆస్తులను జప్తు చేస్తున్నట్టు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ప్రకటించడం.. కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో మాత్రమే కాదు.. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే హాట్ టాపిక్గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

