OTTలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక.. మీరు కూడా ఆ కంటెంట్ చూస్తున్నారా?
ఇండియాస్ గాట్ టాలెంట్ కార్యక్రమంలో రణ్‌వీర్ అల్హాబాదియా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. ఓటీటీలు, సోషల్ మీడియాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఐటీ రూల్స్ 2021 కోడ్ ఆఫ్ ఎథిక్స్‌ను ఓటీటీలు, సోషల్ మీడియాలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. చిన్నారులకు A రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని ఆదేశించింది.
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియాలోని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌లపై ఫిర్యాదులు అందాయని… ఓటీటీ సంస్థలు అన్ని కూడా తప్పకుండా నైతిక విలువలను పాటించాలని వెల్లడించింది. ఇక నుంచి వయస్సు ఆధారిత కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉండాలని సూచించింది. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల రణ్‌వీర్ చేసిన కామెంట్స్‌పై పార్లమెంటు సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు కూడా రణ్‌వీర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. వాక్ స్వాతంత్ర్యం పేరుతో సామాజిక కట్టుబాట్లను గాలికొదిలేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా.? అంటూ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించడానికి ఏవైనా చర్యలు తీసుకొనే యోచనలో ఉన్నారా..? అని సుప్రీం కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు సైతం జారీ చేసింది. దీనిపై చర్చ నడుస్తున్న క్రమంలో ఓటీటీ, సోషల్ మీడియా కంటెంట్‌పై కేంద్రం ప్రకటన జారీ చేసింది. అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌ను అసలు ప్రసారం చేయకూడదని హెచ్చరించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Marco: ఆహాలో దూసుకుపోతున్న మార్కో
మనీలాండరింగ్ కేసులో బుక్కైన శంకర్.. దాదాపు 10 కోట్ల ఆస్తులు జప్తు

విమానంలో సూది గుచ్చుకున్న వ్యక్తికి..రూ. 15 లక్షలు నష్టపరిహారం

అయ్యో.. బిర్యానీ ఎంతపని చేసింది.. 8 గంటల పాటు ఆపరేషన్..

కిమ్ రాక్షస పాలన.. చివరికి అది కొనాలన్నా అనుమతి కావలి

విశాఖ బీచ్‌లో అరుదైన పీతలు! ఎక్కడి నుంచి వచ్చాయంటే

గర్ల్స్ హాస్టల్లో అనుమానాస్పద వస్తువు.. ఏమిటా అని చూడగా !!

త్వరగా వెళ్లేందుకు బైకుపై రైల్వే గేటు దాటుతున్న మహిళ.. చివరికి..

కొడుకును పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న తల్లికి మూగజీవి ఓదార్పు
