OTT Movie: ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ.. ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?
ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేశాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అందులో ఈ బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ కూడా ఉంది.

ఇటీవల తెలుగుతో పాటు వివిధ భాషల్లో రిలీజైన కొన్ని సినిమాలు వివాదాల్లో దారి తీశాయి. కంటెంట్ పరంగానూ చర్చనీయాంశమయ్యాయి. అలా లెస్బియన్ల ఇతి వృత్తంతో తెరకెక్కి ఇటీవల అందరి నోళ్లల్లో నానిన తమిళ సినిమా ‘కాదల్ ఎన్నబదు పొదువుడమై’. జై భీమ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న లిజోమోల్ జోస్ ఈ మూవీలో లెస్బియన్‌గా నటించడం విశేషం. అలాగే తెలుగులో మంచి గుర్తింపు ఉన్న నటుడు వినీత్, రోహిణి కూడా ఈ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. . ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అయితే సినిమా విడుదల తర్వాత చాలా వివాదాస్పదంగా మారింది. చాలా చోట్ల ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు వచ్చాయి. అదే సమయంలో జ్యోతిక లాంటి సినీ ప్రముఖులు కాదల్ ఎన్నబదు పొదువుడమై సినిమాపై ప్రశంసలు కురిపించారు. మంచి సందేశంతో ఉన్న చిత్రాన్ని నిర్మించారంటూ దర్శక నిర్మాతలను మెచ్చుకున్నారు. ఇలా అనేక రకాలుగా వార్తల్లో నిలిచిన ఈ బోల్డ్ మూవీ ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.
కాదల్ ఎన్నబదు పొదువుడమై సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తమిళ ఓటీటీ సంస్థ టెంట్‌కొట్ట సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సడెన్ గా మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా కేవలం తమిళ్ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
సినిమాపై ప్రశంసలు కురిపించిన జ్యోతిక..
❤️ Love without limits! #KaadhalEnbadhuPodhuUdamai — Now streaming exclusively on #Tentkotta! 🌈✨
✨ Subscribe Now https://t.co/zz0ZAaNTUa Go legal say No to Piracy@JPtheactor @Dhananjayang @Nobinkurian@Rohinimolleti @jose_lijomol @danivcharles@UmadeviOfficial… pic.twitter.com/k4LkotQkOn
— Tentkotta (@Tentkotta) March 13, 2025
గతంలో లెన్స్ వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన జయప్రకాశ్ కాదల్ ఎన్నబదు పొదువుడమై దర్శకత్వం వహించారు. గ్లోవింగ్ టంగ్ట్‌న్, మ్యాన్‌కైండ్ సినిమాస్, నిత్స్ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మించాయి. కొంచెం బోల్డ్ కంటెంట్ ఉన్నా మంచి సందేశంతో కూడిన ఈ సినిమాను ఓటీటీ యాప్ లో చూసేయండి మరి.
💖 When hearts understand each other, words become unnecessary.
🌈 Watch #KaadhalEnbadhuPodhuUdamai streaming exclusively on #Tentkotta
✨ Subscribe Now ▶️ https://t.co/zz0ZAaNm4C Go legal say No to Piracy@JPtheactor @Dhananjayang @Nobinkurian@Rohinimolleti… pic.twitter.com/ehj8NqtTIK
— Tentkotta (@Tentkotta) March 14, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి