AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malavika Mohanan: ‘మీరు వర్జినా?’ క్రేజీ హీరోయిన్‌కు నెటిజన్ తింగరి ప్రశ్న.. మాళవిక సమాధానమేంటో తెలుసా?

అభిమానులతో టచ్ లో ఉండేందుకు సినీ తారలు ఎక్కవగా సోషల్ మీడియానే వేదికగా చేసుకుంటారు. తీరిక దొరికినప్పుడల్లా తమ ఫాలోవర్లతో ముచ్చటిస్తుంటారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓంతో ఓపిగ్గా సమాధానాలు ఇస్తుంటారు. అయితే ఇదే అదనుగా తీసుకుని కొందరు నెటిజన్లు చెత్త ప్రశ్నలు, విషయాలు అడుగుతుంటారు.

Malavika Mohanan: 'మీరు వర్జినా?' క్రేజీ హీరోయిన్‌కు నెటిజన్ తింగరి ప్రశ్న.. మాళవిక సమాధానమేంటో తెలుసా?
Malavika Mohanan
Basha Shek
|

Updated on: Apr 21, 2025 | 7:55 PM

Share

ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోంది మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్. తంగలాన్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ మధ్యన ఓ హిందీ సినిమాలోనూ తళుక్కుమందీ అందాల తార. ఇక ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందీ మలయాళ ముద్దుగుమ్మ. సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది మాళవిక. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది. అలాగే ఎప్పటి కప్పుడు తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫోటోలు, వీడియోలను తన ఫాలోవర్లతో పంచుకుంటుంది. ఇక తీరిక దొరికినప్పుడల్లా నెటిజన్లతో ముచ్చటిస్తుంటుందీ అందాల తార. వారు అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలిస్తుంటుంది. అలా తాజాగా కూడా తన ఫాలోవర్లతో ముచ్చటించింది మాళవిక. ట్విట్టర్ వేదికగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి ఎవరికీ తెలియని విషయాలను పంచుకుంది. అయితే ఇదే సమయంలో ఒక నెటిజన్ దీనిని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. ఓ నెటిజన్ మాళవికాను డైరెక్ట్‌గా మీరు వర్జినా అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన మాళవిక.. ‘ఈ రకమైన చెత్త ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు. ఇలాంటివి అడగడం మానేయండి’ అని గట్టిగా ఇచ్చిపడేసింది. దీంతో సదరు నెటిజన్ తన ప్రశ్నను డిలీట్ చేశాడు. ఇక మాళవిక ట్వీట్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం మాళవిక పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో కలిసి ‘ది రాజా సాబ్’సినిమాలో నటిస్తోంది. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల మరో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే వరలక్ష్మీ శరత్ కుమార్, సంజయ్ దత్, అనుపమ్ ఖేర్, రిద్ది కుమార్, మురళీ శర్మ, జరీనా వాహబ్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, యోగిబాబు, వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

ప్రభాస్ ది రాజా సాబ్ తో పాటు కార్తీ సర్దార్ 2లోనూ హీరోయిన్ గా నటిస్తోంది మాళవికా మోహనన్. అలాగే మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నాయి.

మాళవిక ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..