AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumaith Khan: ముమైత్ ఖాన్ చెల్లెలు కూడా టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా? ఏయే సినిమాల్లో యాక్ట్ చేసిందో తెలుసా?

ముమైత్ ఖాన్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.' ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' అంటూ ఆడియెన్స్ గుండెల్లో బాణాలు గుచ్చిందీ అందాల తార. స్పెషల్ సాంగ్స్ తోనే సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ముమైత్ ఖాన్.

Mumaith Khan: ముమైత్ ఖాన్ చెల్లెలు కూడా టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా? ఏయే సినిమాల్లో యాక్ట్ చేసిందో తెలుసా?
Actress Mumaith Khan
Basha Shek
|

Updated on: Mar 06, 2025 | 11:06 AM

Share

ఇప్పుడంటే సినిమాలు తగ్గించేసింది కానీ ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్. తన హుషారెత్తించే స్టెప్పులతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైందీ అందాల తార. పోకిరిలో ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది ముమైత్ ఖాన్. ఆ తర్వాత ప్రభాస్ యోగి సినిమాలో ‘ఓరోరి యోగి’, రాజశేఖర్ ‘ఎవడైతే నాకేంటి’, వెంకటేష్ ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘సీమశాస్త్రి’, ‘మగధీర’, నేనింతే, బుజ్జిగాడు, ఇలా కేవలం 4 ఏళ్లలోనే ఏకంగా 50కి పైగా సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార. తన డిమాండ్ కు తగ్గట్టుగానే గట్టిగానే పారితోషకం తీసుకుంది. అప్పట్లోనే ఒక్కో పాట కోసం సుమారు రూ. 50 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందంటే ముమైత్ కు ఉన్న క్రేజ్ ఇట్టే అర్థం చెప్పుకోవచ్చు. ఇలా కేవలం స్పెషల్ సాంగ్స్ కే పరిమితం కాకుండా ఆపరేషన్ దుర్యోధన, మైసమ్మ ఐపీఎస్ వంటి సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలు పోషించింది ముమైత్. అలాగే పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లోనూ మెరిసింది. అలాగే తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఒడియా భాషా సినిమాల్లోనూ మెరిసిందీ అందాల తార. అయితే కాల క్రమేణా స్టార్ హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్ చేస్తుండడంతో ముమైత్ కు సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. చివరగా ఈ బ్యూటీ ‘RDX లవ్’ సినిమాలో నటించింది ముమైత్ ఖాన్.

సినిమాలతో పాటు టీవీ షోలోనూ, ప్రోగ్రామ్స్ లోనూ సందడి చేసింది ముమైత్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. అలాగే బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ షోలోనూ సందడి చేసింది. ప్రస్తుతం సినిమాకు దూరంగా ఉంటోన్న స్పెషల్ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటోంది.

చెల్లెలితో నటి ముమైత్ ఖాన్..

Mumaith Khan 1

Mumaith Khan 1

నటిగానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గానూ..

ఇవి కూడా చదవండి

ఇక ముమైత్ ఖాన్ చెల్లెలు తెలుగులో క్రేజీ నటి అనే విషయం చాలా మందికి తెలియదు. అవును.. ఆమె పేరు జాబీనా ఖాన్. కేవలం నటిగానే కాకుండా చాలా తెలుగు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా చేసిందీ జాబినా. తెలుగులో గొడవ, జగడం వంటి సినిమాల్లో సైడ్ హీరోయిన్‌గా నటించింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ కూడా సినిమాలకు దూరంగా ఉంటోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.