VaraLaxmi SarathKumar: అనాథ పిల్లలతో పుట్టిన రోజు జరుపుకొన్న వరలక్ష్మి.. చిన్నారులకు కానుకలుగా..
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా ఫేమస్ అయిపోయింది వరలక్ష్మీ శరత్ కుమార్. గతేడాది ఆమె నటించిన ఆరు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వరలక్ష్మికి ఉన్న క్రేజ్ ఏంటో! తాజాగా ఈ అందాల తార ఓ మంచి పని చేసింది.

సాధారణంగా సినిమా తారలు తమ పుట్టిన రోజులు పెద్ద పెద్ద హోటల్స్, రిసార్ట్స్ లలో సెలబ్రేట్ చేసుకుంటారు. కొందరైతే ఇళ్లలోనే తమ కుటుంబ సభ్యులతో బర్త్ డేను గ్రాండ్ గా జరుపుకొంటారు. అయితే టాలీవుడ్ ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం తన బర్త్ డేను వినూత్నంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని లెప్రా సోసైటీ అనాథాశ్రమానికి వెళ్లిన అక్కడి చిన్నారులతో తన పుట్టిన రోజు వేడుకలు చేసుకుంది. పిల్లలతో సరదాగా ఆడిపాడింది. వారితో కలిసి బర్త్ డే కేక్ కట్ చేసింది. అనంతరం చిన్నారులకు విలువైన బహుమతులు అందించింది. అంతేకాకుండా ఆశ్రమానికి తనవంతుగా ఆర్థికసాయం అందజేసింది. ఈ వేడుకల్లో వరలక్ష్మి భర్త నికోలయ్ సచ్‌దేవ్ కూడా పాల్గొన్నాడు. సెలబ్రిటీలు వస్తే అనాథాశ్రమం గురించి ప్రజలకు తెలుస్తుందనే మంచి ఉద్దేశంతోనే వచ్చానని వరలక్ష్మి చెప్పుకొచ్చింది. తన లాగే మరికొందరు సెలబ్రిటీలు ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని నటి కోరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. వరలక్ష్మి గొప్ప మనసును అందరూ ప్రశంసిస్తున్నారు. నటికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. గతేడాది ఏకంగా ఆరు సినిమాల్లో నటించింది వరలక్ష్మి. ఇందులో హనుమాన్ ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ గా విజయం సాధించింది. దీంతో పాటు శబరి, రాయన్, మిస్టర్ సెలబ్రిటీ, మ్యాక్స్ సినిమాల్లోనూ వరలక్ష్మి కీలక పాత్రలు పోషించింది. ఇక ఈ ఏడాదికి రిలీజై సెన్సేషనల్ హిట్ గా నిలిచిన మదగజ రాజాలోనూ ఈ ముద్దుగుమ్మ నటించింది. ప్రస్తుతం విజయ్ దళపతి హీరోగా నటిస్తోన్న జయ నాయగన్ సినిమాలోనూ వరలక్ష్మి కీ రోల్ పోషిస్తోంది.
చిన్నారులకు కానుకలు..

Varalaxmi Sarathkumar Birthday
భర్తతో వరలక్ష్మి శరత్ కుమార్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








