AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shraddha Kapoor: కూతురిచ్చిన బర్త్ డే గిఫ్ట్.. రూ. 6 కోట్లకు అమ్మేసిన నటుడు.. ఎందుకంటే?

ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ గురించి తెలుగు ఆడియెన్స్ కు కూడా ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ ఫేమస్ విలన్ శక్తి కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందీ అందాల తార. ఇక సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది.

Shraddha Kapoor: కూతురిచ్చిన బర్త్ డే గిఫ్ట్.. రూ. 6 కోట్లకు అమ్మేసిన నటుడు.. ఎందుకంటే?
Shraddha Kapoor
Basha Shek
|

Updated on: Mar 04, 2025 | 10:38 PM

Share

బాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో శ్రద్ధా కపూర్ ఒకరు. అలియా, దీపికలతో సమానంగా ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ ఉంది. ఇక ఈ బ్యూటీ సక్సెస్ రేటు కూడా ఎక్కువే. అలాగే ఇతర హీరోయిన్లలా అనవసరమైన గాసిప్‌లలో పడకుండా సినిమాల్లో నటిస్తోంది. శ్రద్ధా కపూర్ మరెవరో కాదు బాలీవుడ్ ప్రముఖ నటుడు కమ్ విలన్ శక్తి కపూర్ కుమార్తె. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ నటుడు నిజ జీవితంలో చాలా ప్రాక్టికల్ గా కనిపిస్తారు. ముఖ్యంగా డబ్బు, ఆస్తుల విషయంలో. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే శక్తి కపూర్ తన కుమార్తె శ్రద్ధా కపూర్ తన పుట్టినరోజుకు ఇచ్చిన ఖరీదైన బహుమతిని అమ్మేశారట. గత సంవత్సరం, శక్తి కపూర్ పుట్టినరోజున, అతని కుమార్తె శ్రద్ధా కపూర్ ముంబైలోని జుహు ప్రాంతంలోని సిల్వర్ బీచ్ హెచెల్ కోఆపరేటివ్ సొసైటీలో ఒక విలాసవంతమైన ఫ్లాట్‌ను ఆయనకు బహుమతిగా ఇచ్చింది.

సుమారు 881 చదరపు అడుగుల ఫ్లాట్‌ను తండ్రికి పుట్టిన రోజు బహుమతిగా ఇచ్చింది శ్రద్ధా. కానీ ఇటీవల, శక్తి కపూర్ ఈ ఫ్లాట్‌ను రూ. 6.11 కోట్లకు అమ్మేశాడు. శ్రద్ధా కపూర్ ఈ ఫ్లాట్‌ను బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తలు సతీష్ వెంకటేష్, అర్చన తనేజాల నుంచి కొనుగోలు చేసింది. ఈ ఫ్లాట్ శక్తి కపూర్, శ్రద్ధా కపూర్ ల పేరుమీద ఉంది.

ఇటీవల, శ్రద్ధా కపూర్ ముంబైలోని పరిమళ మహాలక్ష్మి సౌత్ టవర్‌లో వెయ్యి చదరపు అడుగుల కంటే కొంచెం ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఒక విశాలమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ఈ ఫ్లాట్‌లో రెండు బాల్కనీలు ఉన్నాయి. ఈ ఫ్లాట్ కోసం నటి రూ.6.24 కోట్లు ఖర్చు చేసింది. శ్రద్ధా కపూర్ ఇటీవల కొనుగోలు చేసిన ఫ్లాట్ కూడా జుహులోనే ఉంటోంది. శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో 2024లో విడుదలైన ‘స్త్రీ 2’ సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా షారుఖ్ ఖాన్ ‘జవాన్’ కలెక్షన్‌ను కూడా అధిగమించింది. శ్రద్ధా కపూర్ ప్రస్తుతం రాహుల్ మోడీ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో ఉంది. ఈ జంట తరచుగా కలిసి కనిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెల్లారి పొలానికి వెళ్లిన రైతుకు కనిపించిన పెద్ద గొయ్యి..
తెల్లారి పొలానికి వెళ్లిన రైతుకు కనిపించిన పెద్ద గొయ్యి..
మార్చి 3న చంద్రగ్రహణం.. హోలీ జరుపుకుంటున్నారా?
మార్చి 3న చంద్రగ్రహణం.. హోలీ జరుపుకుంటున్నారా?
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
తలలో పేలు ప్రాణం తీయగలవా?.. ఇలా చేస్తే మొత్తం పరార్
తలలో పేలు ప్రాణం తీయగలవా?.. ఇలా చేస్తే మొత్తం పరార్
ఈ పండు మగవాళ్ళు తింటే పిల్లలు పుట్టరా? బయటపడ్డ నమ్మలేని నిజాలు
ఈ పండు మగవాళ్ళు తింటే పిల్లలు పుట్టరా? బయటపడ్డ నమ్మలేని నిజాలు
దుబాయ్ పేలుళ్ల నుంచి తప్పించుకుని బెంగళూరు చేరుకున్న పీవీ సింధు
దుబాయ్ పేలుళ్ల నుంచి తప్పించుకుని బెంగళూరు చేరుకున్న పీవీ సింధు
కరోనా ఆనందయ్య గుర్తున్నారా..? ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలిస్తే..
కరోనా ఆనందయ్య గుర్తున్నారా..? ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలిస్తే..
చంద్రగ్రహణాన్ని కళ్లతో చూడొచ్చా..! ఏ టైమ్‌కు ఎలా చూస్తే..
చంద్రగ్రహణాన్ని కళ్లతో చూడొచ్చా..! ఏ టైమ్‌కు ఎలా చూస్తే..
లగ్జరీ స్పోర్ట్స్ కారులో సంపూర్ణేష్ బాబు చక్కర్లు..
లగ్జరీ స్పోర్ట్స్ కారులో సంపూర్ణేష్ బాబు చక్కర్లు..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు