AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: 550కు పైగా వికెట్లు తీసిన టీమిండియా మాజీ క్రికెటర్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

భారత క్రికెట్ లో తీవ్ర విషాదం నెలకొంది. ముంబైకు చెందిన మాజీ దిగ్గజ క్రికెటర్ 84 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. దీంతో పలువురు క్రికెటర్లు ఈ ఆటగాడి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తన ఓవరాల్ కెరీర్ లో 550 కి పైగా వికెట్లు పడగొట్టాడీ క్రికెటర్.

Team India: 550కు పైగా వికెట్లు తీసిన టీమిండియా మాజీ క్రికెటర్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
Team India Cricketer
Basha Shek
|

Updated on: Mar 04, 2025 | 6:45 AM

Share

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ-ఫైనల్ లో భాగంగా మంగళవారం (మార్చి 4) నాడు టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం టీం ఇండియా బాగా సన్నద్ధమైంది. అయితే అంతకు ముందే, భారత క్రికెట్ లో ఒక విషాదం చోటు చేసుకుంది. మాజీ దిగ్గజ క్రికెటర్ కన్నుమూశారు. ముంబైకు చెందిన మాజీ స్పిన్నర్ పద్మాకర్ శివాల్కర్ తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలకు తోడు ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో మంగళ వారం ఆయన కన్నుమూశారు. పద్మాకర్ శివాల్కర్ వయస్సు 84 సంవత్సరాలు.

పద్మాకర్ శివాల్కర్ ముంబై క్రికెట్‌కు 2 దశాబ్దాల పాటు సేవలందించారు. సుమారు 20 సంవత్సరాల పాటు ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సమయంలో శివాల్కర్ అనేక రికార్డులు సృష్టించాడు. అయితే దురదృష్టవశాత్తూ అతనికి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రాలేదు. బిషన్ సింగ్ బేడి శివల్కర్ సమకాలీనుడు. ఆ సమయంలో భారత జట్టులో బిషన్ సింగ్ బేడి ప్రముఖ స్పిన్నర్లలో ఒకరు కావడంతో శివల్కర్ కు అవకాశం రాలేదని కూడా చెబుతారు.

ఇవి కూడా చదవండి

పద్మాకర్ శివాల్కర్ 1961/62 సీజన్‌లో 21 సంవత్సరాల వయసులో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. షివాల్కర్ 1987/88 సీజన్ వరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. ఈ కాలంలో శివాల్కర్ 124 మ్యాచ్‌లు ఆడాడు. 124 మ్యాచ్‌ల్లో మొత్తం 589 వికెట్లు పడగొట్టాడు. అతను 42 సార్లు 5 వికెట్లు కూడా తీయగలిగాడు. అతను ఒకే మ్యాచ్‌లో 13 సార్లు 10 వికెట్లు కూడా తీసుకున్నాడు. 1972/73 రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో తమిళనాడుపై శివాల్కర్ మొత్తం 13 వికెట్లు పడగొట్టాడు. దీనితో, ముంబై వరుసగా 15వ సారి రంజీ ట్రోఫీని గెలుచుకుంది. పద్మాకర్ శివాల్కర్ మరణం పట్ల ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజింక్య నాయక్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. పద్మాకర్ శివాల్కర్ తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేయడం ద్వారా ఆయన తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పద్మాకర్ శివాల్కర్ మరణం భారత క్రికెట్ సమాజానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రముఖుల సంతాపం..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.