Tollywood: గోవులకు పూజ చేస్తోన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? స్టార్ డైరెక్టర్ కూతురు.. ఆ యంగ్ హీరో చెల్లి
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అందరూ ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. సమీపంలోని శివాలయాలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు.ఈ క్రమంలోనే ఓ టాలీవుడ్ సెలబ్రిటీ ఆవుకు ప్రత్యేక పూజలు చేసింది.

మహా శివరాత్రి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు. చాలా మంది ఇంట్లోనే ప్రత్యేక పూజలు చేస్తే, మరికొందరు సమీపంలోని శివాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీ ఒకరు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోవులకు ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. పై ఫొటోలు అవే. ఇంతకీ ఈ ఫొటోల్లో గోవులతో క్యూట్ గా ఉన్న ఈ అమ్మాయి ఎవరు? అని అనుకుంటున్నారా? ఆమె మరెవరో కాదు డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారాల పట్టి పవిత్ర. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె రెగ్యులర్ గా తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అలా ఇటీవల శివరాత్రికి ఓ ఆలయంలో ఉండే గోశాలలో ఇలా ఆవులకు ప్రత్యేక పూజలు చేసింది పవిత్ర. అనంతరం ఆవులతో, దూడలతో క్యూట్ గా ఫొటోలు దిగింది. ‘నంది బలానికి, పవర్ కి, ఎదుగుదలకు ప్రతిరూపం. ఓం నమః పార్వతి పతయే హర హర మహాదేవ’ అంటూ ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానుల పూరి కూతురు ఎంత క్యూట్ గా ఉందో అని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా పవిత్ర ఆల్రెడీ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుతున్నట్టు సమాచారం. అయితే వాళ్ళ నాన్న, అన్న లాగా పవిత్ర సినిమాల్లోకి రాదని తెలుస్తోంది. ఇక పూరి జగన్నాధ్ విషయానికి వస్తే.. లైగర్, డబల్ ఇస్మార్ట్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ పరాజయాలు ఎదుర్కొన్నాడు. అతని గ్రేట్ కమ్ బ్యాక్ కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పూరి జగన్నాథ్ తర్వాతి ప్రాజెక్టు గురించి ఇంకా క్లియర్ అప్ డేట్ రావాల్సి ఉంది.
మహా శివరాత్రి వేడుకల్లో పూరి జగన్నాథ్ కూతురు..
View this post on Instagram
మరోవైపు ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఆకాశ్ పూరి ఆంధ్రా పోరి, రొమాంటిక్, మెహబూబా, చోర్ బజార్ సినిమాల్లో నటించాడు. అయితే ఈ హీరోకు ఇంకా సరైన బ్రేక్ రాలేదు.
అమ్మానాన్నలతో ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.