AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandla Ganesh: షాద్ నగర్ నుంచి తిరుమలకు.. బండ్ల గణేష్ 500 కిలోమీటర్ల పాదయాత్ర.. ఎందుకంటే?

టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ మహా పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. తన సొంతూరు షాద్ నగర్ నుంచి తిరుమల శ్రీవారి ఆలయం వరకు సుమారు 500 కిలోమీటర్లకు పైగా ఆయన పాదయాత్ర చేయనున్నాడని సమాచారం.

Bandla Ganesh: షాద్ నగర్ నుంచి తిరుమలకు.. బండ్ల గణేష్ 500 కిలోమీటర్ల పాదయాత్ర.. ఎందుకంటే?
Bandla Ganesh
Basha Shek
|

Updated on: Mar 01, 2025 | 9:17 PM

Share

బండ్ల గణేష్.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. కమెడియన్ గానూ, సహాయ నటుడిగానూ, నిర్మాతగానూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. అయితే ప్రస్తుతం బండ్లన్న సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తోన్ బండ్ల గణేష్ త్వరలోనే ఓ సంచలన పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తోంది. అయితే ఉన్నట్లుండి ఆయన ఎందుకు ఈ పాదయాత్ర చేయనున్నారు? అనేది ఇప్పుడు సినీ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. తన సొంతూరైన షాద్ నగర్ నుంచే బండ్లన్నపాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారట. ఇక్కడి నుంచి ఏడు కొండల వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి వరకు సుమారు 500 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేయనున్నారట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

ఎందుకీ పాదయాత్ర!

కాగా ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు బండ్ల గణేష్. ఆ మధ్యన ఆయనకు పార్టీలో కీలక పదవి దక్కనుందని ప్రచారం కూడా జరిగింది. ఇక అప్పుడప్పుడూ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపైనా బండ్లన్న స్పందిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తాను భక్తుడినని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు బండ్ల గణేష్.

ఇవి కూడా చదవండి

అయితే బండ్ల గణేష్ ఉన్నట్లుండి పాదయాత్రకు శ్రీకారం చుట్టడానికి కారణమేంటన్న దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బండ్లన్న ఏదో పెద్ద సినిమానే ప్లాన్‌ చేశాడు.. అందుకే శ్రీవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇలా పాదయాత్ర చేస్తున్నాడంటూ ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాగా గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో త్వరలోనే ఓ సినిమా తీయనున్నారని ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు బండ్ల గణేష్. ఈ క్రమంలోనే ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

మళ్లీ సినిమాల్లో బిజీ అవుతారా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..