Priyamani:’మాపై లవ్ జిహాద్ ఆరోపణలు చేస్తున్నారు.. పిల్లలనూ వదలడం లేదు’.. ప్రియమణి ఆవేదన
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది ప్రియమణి. తన అద్భుతమైన నటనతో జాతీయ అవార్డు కూడా అందుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మళయాళ భాషలలో సినిమాలు చేసిందీ అందాల తార. ఇప్పటికీ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా ఉంటోందీ ముద్దుగుమ్మ.

పెళ్ళైన కొత్తలో అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. తన అందం, అభినయంతో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ లోనూ షారుఖ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక పెళ్లైన తర్వాత కూడా వరుసగా సినిమాల్లో నటిస్తోందీ అందాల తార. అలాగే పలు టీవీ షోలకు జడ్డిగా చేస్తూ బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ వంటి వెబ్ సిరీసుల్లోనూ సందడి చేస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే తన వ్యక్తిగత జీవితంలోనూ వార్తల్లో నిలిచింది ప్రియమణి. ముఖ్యంగా తన వివాహం. ముస్లిం మతానికి చెందిన ముస్తఫా రాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రియమణి. 2017లో వీరి పెళ్లి జరిగింది. మతాంతర వివాహమైనా వీరి కాపురం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది. అయితే ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ప్రియమణిపై తరచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ విషయంపై ఇప్పటికే పలు సార్లు ఆవేదన వ్యక్తం చేసిందీ అందాల తార. తాజాగా మరోసారి మ్యారేజ్ లైఫ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రియమణి.
‘నేను ముస్తఫా రాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా ఎంగేజ్‌మెంట్ సమయంలో ఈ విషయాన్ని ఆనందంగా అందరితో పంచుకోవాలనుకుంటే సంతోషిస్తారు అనుకున్నాను. కానీ అప్పటి నుంచే మాపై లవ్ జిహాద్ ఆరోపణలు చేస్తున్నారు. మా పెళ్లి విషయంలో ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. నా భర్తతో కలిసున్న ఫొటో షేర్ చేస్తే.. 90 శాతం మంది మా పెళ్లి గురించే నెగెటివ్ కామెంట్స్ చేస్తారు. అంతే కాకుండా నాకు పుట్టబోయే మీ పిల్లల గురించి దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో మీ పిల్లలు ఐసిస్‌లో చేరుతారంటూ నీచాతినీచంగా మాట్లాడుతున్నారు. ఈ కామెంట్స్ విన్నప్పుడల్లా మనస్సు చివుక్కుమంటుంది. అయితే నా జీవితాన్ని నా కిష్టమైన విధంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి వీటిని పట్టించుకోవట్లేదు. అయినా ఇప్పటికీ మాపై ట్రోలింగ్ చేస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేసింది ప్రియమణి.
ప్రియమణి లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ అనే చిత్రంలో నటించింది ప్రియమణి. ప్రస్తుతం దళపతి విజయ్ ‘జననాయగన్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ వెబ్ సిరీస్ తోనూ బిజీగా ఉంటోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




