ఈ అమ్మడి మనసూ అందమైనదే.. వంద మంది చిన్నారులకు వంకాయ బిర్యానీ వండి వడ్డించిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో
11 ఏళ్లకే బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 15వ ఏటనే నటిగా తన ట్యాలెంట్ నిరూపించుకుంది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించి మెప్పించింది. అదే సమయంలో ఒక ట్యాలెంటెడ్ తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ అందాల తార ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్ సినిమాల్లో నటించి మెప్పించింది. కొన్ని సినిమాల్లో సహాయ నటిగానూ యాక్ట్ చేసింది. అదే సమయంలో తనతో కలిసి నటించిన ఒక హీరోతో ప్రేమలో పడింది. పెద్దల ఆశీర్వాదంతో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. గతంలోలాగా ఎక్కువగా సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోందీ అందాల తార. అలా తాజాగా ఆమె షేర్ చేసిన ఒక వీడియో అందరి మన్ననలు అందుకుంటోంది. వంద మంది చిన్నారులకు స్వయంగా వంకాయ బిర్యానీ వండి వడ్డించిందీ అందాల తార. తద్వారా తన మనసూ అందమైనదేనని మరోసారి నిరూపించుకుందీ అందాల తార. తాను చేసిన మంచి పనికి సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు వితికా షేరు. అదే నండి మన టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ముద్దుల భార్య.
సోషల్ మీడియాలో బిజీగా ఉండే వితిక తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె స్వయంగా వంకాయ బిర్యానీ వండింది. ఆ తర్వాత తానే వంద మంది చిన్నారులకు తన గుత్తి వంకాయ బిర్యానీ వడ్డించింది. అంతేకాదు పిల్లలకు బహుమతులు కూడా అందించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన వారందరూ వితికా షేరును తెగ ప్రశంసిస్తున్నారు.
ఘుమఘుమలాడే గుత్తి వంకాయ బిర్యానీ తయారు చేస్తోన్న వితికా షేరు.. వీడియో ఇదిగో..
చిన్నారులకు తన గుత్తి వంకాయ బిర్యానీ వండిస్తోన్న వితికా షేరు.. వీడియో..
తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించింది వితికా షేరు. 2009లో ప్రేమించు రోజుల్లో అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత సందడి, ఝుమ్మంది నాదం, భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్, పడ్డానండి ప్రేమలో మరి, మహాబలిపురం సినిమాల్లో హీరోయిన్ గా, సహాయక నటిగా అలరించింది.
భర్త వరుణ్ సందేశ్ తో వితికా షేరు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








