- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actress Mehreen Pirzada Visits Tirumala Srivari Temple, See Photos
Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ టాలీవుడ్ హీరోయిన్ సినిమాల్లో కనిపించి చాలా రోజులైంది. అవకాశాలు లేకో ఇతర కారణాలో తెలియదు కానీ ఈ అమ్మడు ఇప్పుడు ఎక్కువగా బయట కూడా కనిపించడం లేదు. అయితే ఉన్నట్లుండి పవిత్ర తిరుమల శ్రీవారి క్షేత్రంలో ప్రత్యక్షమైందీ అందాల తార.
Updated on: Mar 01, 2025 | 10:40 PM

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాడా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొంది. శనివారం (మార్చి 01) ఆమె ఏడుకొండల స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంది

మెహ్రీన్ తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో, మజాకా ఫేమ్ సందీప్ కిషన్ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు.

కాగా మెహ్రీన్ తెలుగు సినిమాల్లో కనిపించి చాలా రోజులవుతోంది. ఆమె చివరిగా 2002లో రిలీజైన ఎఫ్ 3: ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమాలో నటించింది.

ఆ తర్వాత స్పార్క్ అనే ఓ చిన్న సినిమాలోనూ యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒక కన్నడ సినిమా మాత్రమే ఉంది.

కాగా మెహ్రీన్ హరియాణాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. అయితే నాలుగు నెలల తర్వాత తన ఎంగేజ్ మెంట్ ను రద్దు చేసుకుందీ అందాల తార.

ఆ మధ్యన ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించి వార్తల్లో నిలిచింది మెహ్రీన్. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తోందీ అందాల తార.




