AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ అబ్బాయిని గుర్తు పట్టారా? సపోర్టింగ్ రోల్స్ టు క్రేజీ హీరో.. ఛార్మింగ్ స్టార్ ట్యాగ్ కూడా..

చాలా మంది హీరోల్లాగే ఇతను కూడా కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. వాటితోనే ట్యాలెంటెడ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సోలో హీరోగానూ సక్సెస్ అయ్యాడు. ఆ మధ్యన కాస్త స్లో అయినా ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో స్పీడ్ పెంచాడీ హీరో.

Tollywood: ఈ అబ్బాయిని గుర్తు పట్టారా? సపోర్టింగ్ రోల్స్ టు క్రేజీ హీరో.. ఛార్మింగ్ స్టార్ ట్యాగ్ కూడా..
Tollywood Actor
Basha Shek
|

Updated on: Mar 06, 2025 | 8:56 AM

Share

పై ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తోన్న అబ్బాయిని గుర్తు పట్టారా? అతను ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో. అలాగే మోస్ట్ హ్యాండ్సమ్ హీరో కూడా. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాడీ హీరో. ఇక్కడే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నాడు. ఆ తర్వాత సికింద్రాబాద్ వెస్లీ డిగ్రీ కాలేజీలో బీకామ్ పూర్తి చేశాడు. ఇదే క్రమంలో నటనపై ఆసక్తి ఉండడంతో ముంబైలోని కిశోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్ స్టిట్యూట్ లో చేరాడు. మొదట సపోర్టింగ్ ఆర్టిస్టుగా సినిమా కెరీర్ ప్రారంభించాడు. కెరీర్ ప్రారంభంలోనే చిరంజీవి, వెంకటేష్ లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత సోలో హీరోగానూ సక్సెస్ అయ్యాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి టాలీవుడ్ లో మినిమిం గ్యారంటీ హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ఇతని సినిమాలు కుటుంబ సమేతంగా చూడదగ్గవిగా ఉంటాయి. అందుకే ఈ హీరో అంటే ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా ఇష్టపడతారు. మరి ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా? ఇతను రామ్ చరణ్, దగ్గుబాటి రానాలకు బెస్ట్ ఫ్రెండ్. ముగ్గురూ కలిసి బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. అతను మరెవర కాదు ఛార్మింగ్ స్టార్ శర్వానంద్. గురువారం (మార్చి 06) ఈ నటుడి పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు , నెటిజన్లు శర్వాకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అదే సమయంలో ఈ హీరో చిన్నప్పటి ఫొటోలు, ఆసక్తికర విషయాలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కాగా శర్వానంద్ చివరిగా మనమే సినిమాలో కనిపించాడు. గతేడాది రిలీజైన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు శర్వా. ప్రస్తుతం ఈ హీరో చేతిలో మూడు సినిమాలున్నాయి. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో శర్వా 36 (వర్కింగ్ టైటిల్) ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే సామజవరగమన ఫేం రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలోనూ Sharwa 37 (వర్కింగ్ టైటిల్) పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. సాక్షి వైద్య, సంయుక్త మీనన్ శర్వానంద్ సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక సంపత్ నంది దర్శకత్వంలోనూ ఓ సినిమాను పట్టాలెక్కించాడీ ప్రామిసింగ్ హీరో. ఇవాళ పుట్టిన రోజు కావడంతో శర్వానంద్ కొత్త సినిమాలకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

కూతురితో శర్వానంద్..

View this post on Instagram

A post shared by Sharwanand (@imsharwanand)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు