- Telugu News Photo Gallery Cinema photos Actress Vithika Sheru shares her sister Krithika Sheru house warming ceremoney photos
Vithika Sheru: అరే… ఇద్దరూ ట్విన్స్‌లా ఉన్నారే? వితికా షెరు చెల్లెలిని చూశారా? ఫొటోస్ వైరల్
వరుణ్ సందేశ్ సతీమణి, ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ వితికా షెరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ అందాల తార ఆ తర్వాత హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్ సినిమాల్లో నటించి మెప్పించింది. కొన్ని సినిమాల్లో సహాయ నటిగానూ యాక్ట్ చేసింది.
Updated on: Mar 06, 2025 | 6:29 AM

వరుణ్ సందేశ్ ను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత సినిమాలు తగ్గించేసింది వితికా షెరు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ అందాల తార.

తాజాగా వితిక తన చెల్లి కృతిక గృహ ప్రవేశానికి సంబంధించిన కొన్ని ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా షేర్ చేసుకుంది

ఇందులో అక్కా చెల్లెళ్లిద్దరూ ఎంతో క్యూట్ గా కనిపంచారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

వితిక, కృతిక ల ఫొటోలను చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సినిమా ఇండస్ట్రీతో కృతికకు ఎలాంటి సంబంధం లేదు.

కాగా 2021లో చెల్లి కృతిక పెళ్లి దగ్గరుండి జరిపించింది వితిక. ఈ క్రమంలోనే తాజాగా భర్త కృష్ణతో కలిసి కొత్తింట్లో అడుగుపెట్టింది కృతిక.

ఇక వితిక ఇటీవల వంద మంది చిన్నారులకు స్వయంగా గుత్తి వంకాయ కూర బిర్యానీ వండి వడ్డించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో కూడా నెటిజన్లు ఆకట్టుకుంటోంది.




