- Telugu News Photo Gallery Cricket photos Shreyas Iyer sister Shrestha made Bollywood debut with special song, Photos here
Shreyas Iyer: సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్ సోదరి.. స్పెషల్ సాంగ్‌తో అదరగొట్టేసింది.. ఫొటోస్ ఇదిగో
ప్రస్తుతం టీమిండియాలో రెగ్యులర్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు శ్రేయస్ అయ్యర్. దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ పరుగులు వర్షం కురిపిస్తున్నాడు. కాగా శ్రేయస్ అయ్యర్ ఆట చూసేందుకు ఇటీవల దుబాయ్ కు వచ్చింది అతని సోదరి శ్రేష్ట అయ్యర్.
Updated on: Mar 05, 2025 | 10:20 PM

దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అంచనాలకు మించి రాణిస్తున్నాడు శ్రేయస్ అయ్యార్. కాగా అయ్యర్ ఆట చూసేందుకు ఇటీవల అతని సోదరి శ్రేష్ట దుబాయ్ కు వచ్చింది.

క్రికెట్ గ్యాలరీలో ఉంటూ తన తమ్ముడిని ఉత్సాహ పరుస్తూ కెమెరాల దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ అమ్మడి ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

ఈ క్రమంలోనే శ్రేష్ట కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదేంటంటే కొరియోగ్రాఫర్, ప్రొఫెషనల్ డాన్సర్ అయిన శ్రేష్ట ఇటీవలే ఓ స్పెషల్ సాంగ్‌తో బాలీవుడ్‌లో కి ఎంట్రీ ఇచ్చింది.

‘సర్కారీ బచ్చా’ అనే సినిమాలో ‘అగ్రిమెంట్ కర్లే’ అంటూ సాగే పాటకు హుషారైన స్టెప్పులేసింది శ్రేష్ట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

ఇక సోషల్ మీడియాలోనూ శ్రేష్టకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నెట్టింట ఆమె షేర్ చేసే ఫొటోలకు, వీడియోలకు మంచి స్పందన వస్తుంటుంది.

మరి శ్రేష్ట సినిమాల్లో సక్సెస్ అవుతుందో? లేదో? చూడాలి. ప్రస్తుతానికి అయితే ఈ ముద్దుగుమ్మ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతన్నాయి.




