Prabhas: ప్రభాస్.. ప్రశాంత్ వర్మ సినిమా ఫిక్స్! మరి రిషబ్ శెట్టి జై హనుమాన్ సంగతేంటంటే?
'హనుమాన్' సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు. చాలా మంది స్టార్ నటులు ఈ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో సినిమా తీయాలనుకున్నాడు ప్రశాంత్ వర్మ. అయితే అది కుదరలేదు. ఇప్పుడు ప్రభాస్ కి కొత్త కథ మెప్పించిన చెప్పిన ప్రశాంత్ వర్మ దానిని మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు.

హనుమాన్ తర్వాత జై హనుమాన్ అంటూ సీక్వెల్ ప్రకటించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. కాంతార సినిమాతో పాన్ ఇండియా నటుడిగా మారిపోయిన ఈ సీక్వెల్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. దీంతో పాటు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞతో కూడా ఓ సినిమాను అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ. అయితే ప్రస్తుతానికి ఈ రెండు సినిమాలు హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కి కొత్త కథ చెప్పిన ప్రశాంత్ వర్మ ముందుగానే ఈ సినిమానే పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కి చెప్పిన కథకు సంబంధించిన స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధంగా ఉంది, వర్మ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు బ్రహ్మ రాక్షస్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ సినిమా ప్రారంభమైతే, రిషబ్ శెట్టితో ‘జై హనుమాన్’ సినిమా ఖచ్చితంగా వాయిదా పడుతుంది. రిషబ్ శెట్టి ‘కాంతార, చాప్టర్ 1’ ఈ ఏడాది చివరి నాటికి విడుదల కానుంది. ఆ తర్వాత, అతను 2027లో ‘ఛత్రపతి శివాజీ’ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. ఆ తర్వాతే ‘జై హనుమాన్’ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.
మరోవైపు ప్రభాస్ కూడా ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి సినిమా షూటింగ్ లో డార్లింగ్ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ రెండు చిత్రాల తర్వాత, ప్రభాస్ కు కాస్త గ్యాప్ దొరకనుంది. ఇప్పుడు ఆ సమయంలో ప్రశాంత్ వర్మతో ఒక సినిమా పూర్తి చేయాలని ప్రభాస్ యోచిస్తున్నాడు. దీనితో పాటు, ప్రభాస్ ‘కల్కి 2’, ‘సలార్ 2’ హోంబాలే నిర్మాణంలో మరో చిత్రంలో కూడా ప్రభాస్ నటించాల్సి ఉంది.
ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్
The WORLD is witnessing an ignition BLAZING like never before 💥💥🤙🏻🤙🏻#RecordBreakingRajaSaab ❤️#Prabhas #TheRajaSaab pic.twitter.com/5KUBisLlfP
— The RajaSaab (@rajasaabmovie) October 24, 2024
బ్రహ్మ రాక్షస్ తర్వాతే జై హనుమాన్..
JAI JAI HANUMAN !! 💪🏽✊🏽😊@shetty_rishab @RanaDaggubati @ThePVCU pic.twitter.com/wwxwOndnr2
— Prasanth Varma (@PrasanthVarma) November 4, 2024
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








