OTT Movie: ఇదేం ట్విస్ట్! థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలో సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్
సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత నే సినిమాలు ఓటీటీలోకి వస్తుంటాయి. ఒకటి, రెండు రోజులు ముందు, వెనకా అయినా థియేట్రికల్ రిలీజ్, ఓటీటీ వెర్షన్ కు కనీసం నెల రోజులైన గ్యాప్ ఉండాల్సిందే. అయితే ఈ మూవీ మాత్రం థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రస్తుతం మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ బడ్జెట్ లో రూపొందినా ఆసక్తికర కథ, కథనాలతో భారీ వసూళ్లు రాబడుతున్నాయి మాలీవుడ్ మూవీస్. ముఖ్యంగాఈ మధ్యన మలయాళంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ సినిమాలకు బాగా ఆదరణ దక్కుతోంది. కిష్కింద కాండం, సూక్ష్మ దర్శిని, రేఖా చిత్రం సినిమాలు ఇందుకు మంచి ఉదాహరణలు. ఈ సినిమాలకు ఓటీటీలో రికార్డు వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఇదే కోవలో మరో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. అదే టాలీవుడ్ హీరోయిన ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ. మలయాళ ప్రముఖ నటుడు కుంచకో బోబన్ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. ఫిబ్రవరి 20న మలయాళంలో రిలీజైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. కేవలం రూ. 12 కోట్లతో తీసిన ఈ సినిమా మలయాళంలో ఏకంగా రూ. 60 కోట్ల వరకు రాబట్టింది. దీంతో తెలుగులోనూ రిలీజ్ ప్లాన్ చేశారు. మొదట మార్చి 7న విడుదల చేద్దామనుకున్నారు.. తీరా చూస్తే మార్చి 14వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రమోషన్లు నిర్వహించకపోవడంతో కనీసం ఈ సినిమా థియేటర్లలోకి వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు.
అయితే ఇప్పుడీ సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాబోతుండడం విశేషం. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 20 నుంచే ఈ సినిమాను ఓటీటీలోకి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది
కాగా ఆఫీసర్ ఆన్ డ్యూటీ మలయాళ వెర్షన్ కి నెలరోజుల గ్యాప్ ఓకే కానీ తెలుగులో మరీ థియేటర్లలోకి వచ్చిన వారానికే ఓటీటీలోకి రావడం గమనార్హం. జితు అష్రాఫ్ తెరకెక్కించిన ఈ సినిమాలో జగదీష్, విశాక్ నాయర్, ఆడుకలం నరేన్, వైశాఖ్ శంకర్, విష్ణు జి. వారియర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో ఈ సూపర్ హిట్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..
Puthiya officer etheetund, stand in line and salute 🫡 Watch Officer on Duty on Netflix, out 20 March in Malayalam, Hindi, Telugu, Tamil, Kannada#OfficerOnDutyOnNetflix pic.twitter.com/1Y8O7aK3ln
— Netflix India South (@Netflix_INSouth) March 15, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








