OTT Movie: ఓటీటీలోకి మరో మలయాళ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
మలయాళ ప్రముఖ నటుటు బాసిల్ జోసెఫ్ సౌబిన్ షాహిర్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. డార్క్ కామెడీ గా రూపొందిన ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. థియేటర్లలో ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్న ఈ మలయాళ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అది కూడా తెలుగు వెర్షన్ లో..

ఓటీటీల్లో ప్రతి వారం కొత్త సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. వీటిలో కొన్ని మాత్రమే అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ముఖ్యంగా ఈ మధ్యన మలయాళ సినిమాలకు ఓటీటీలో బాగా ఆదరణ దక్కుతోంది. కిష్కింద కాండం, సూక్ష్మ దర్శిని, రేఖా చిత్రం తదితర మలయాళ సినిమాలు ఓటీటీ ఆడియెన్స్ ను బాగా అలరించాయి. ఇప్పుడీ జాబితాలోకి మరో మలయాళ సూపర్ హిట్ సినిమా రానుంది. అదే ప్రవీణ్ కూడు షప్పు. బసిల్ జోసెఫ్, సౌబిన్ షాహిర్, చెంబన్ వినోద్ జోస్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే సీనియర్ నటి రేవతి మరో కీలక పాత్రలో కనిపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 16న ఈ సినిమా థియేటర్లలో విడుదలై ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రవీణ్ కూడు షప్పు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రం ఏప్రిల్ 11 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉండనుంది. దీనికి సంబంధించి సోనీ లివ్ తమ అధికారిక సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ను కూడా షేర్ చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.
శ్రీరాజ్ శ్రీనివాసన్ తెరకెక్కించిన ప్రవీణ్ కూడు షప్పు సినిమాలో బాసిల్ జోసెఫ్ సబ్-ఇన్‌స్పెక్టర్ పాత్రను పోషించగా, సౌబిన్ మెజీషియన్ పాత్రలో అదరగొట్టాడు. డార్క్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా చాలానే ఉన్నాయి. అన్వర్ రషీద్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అన్వర్ రషీద్ ఈ సినిమాను నిర్మించారు. విష్ణు విజయ్ సంగీతం అందించారు.
సోనీ లివ్ లో స్ట్రీమింగ్.. ట్రైలర్ ఇదిగో..
Get ready for a dark comedy that unfolds the chaos-#PravinkooduShappu trailer out now! #PravinkooduShappu #PravinkooduShappuOnSonyLIV@basiljoseph25 @IamChandini #SoubinShahir #ChembanVinodJose #ShyjuKhalid #Chandini #SreerajSreenivasan pic.twitter.com/t8fMtcHKbt
— Sony LIV (@SonyLIV) March 14, 2025
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.