Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఈ స్కేరీ గేమ్ ఆడితే చావు తప్పదు! సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శరత్ బాబు తనయుడి థ్రిల్లర్ మూవీ

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేశాయి. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా మాత్రం ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: ఈ స్కేరీ గేమ్ ఆడితే చావు తప్పదు! సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శరత్ బాబు తనయుడి థ్రిల్లర్ మూవీ
OTT Movie
Follow us
Basha Shek

|

Updated on: Mar 16, 2025 | 6:01 PM

దివంగత నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ తేజ్ హీరోగా నటించిన చిత్రం దక్ష. విక్రాంత్ తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ 2023 ఆగస్టు 25న థియేటర్లలో విడుదలయింది.  తనికెళ్ల భరణి లాంటి ప్రముఖులు ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు. అయితే అందరూ కొత్త నటీనటులు కావడంతో జనాలు ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. అదే సమయంలో కంటెంట్ పరంగా ఈ సినిమాకు మంచి పేరొచ్చింది.  కాగా  థియేటర్లలో విడుదలైన రెండేళ్ల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా Bcineet OTT, Hungama OTT లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే యూట్యూబ్ లోనూ ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాలో ఆయుష్ తేజ్ తో పాటు అఖిల్, అను, నక్షత్ర, రియా, రవి రెడ్డి, శోభన్ బోగరాజు, పవన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సస్పెన్స్‌ థ్రిల్లింగ్‌ చిత్రానికి లలిత్‌ సంగీతం అందించారు. ఈ సినిమాకు కథ,మాటలు శివ కాకు, అందించగా కెమెరాకు శివ రాథోడ్, ఆర్‌.ఎస్‌ . శ్రీకాంత్‌ పని చేశారు.

గేమ్ ఆడిన వారందరూ ఎలా చనిపోతున్నారు?

దక్ష సినిమా కథ విషయానికి వస్తే.. కొంతమంది యువతీయవకులు వినోదం కోసం సరదాగా ఓ స్కేరీ గేమ్‌ ఆడడం మొదలు పెడతారు. అయితే ఆ గేమ్‌ ఆడిన వారందరూ ఒక్కొక్కరుగా మృతి చెందుతారు. అసలు ఆ గేమ్‌ మిస్టరీ ఏంటి? ఆడిన వాళ్లు ఎందుకు మరణిస్తున్నారు? వాళ్లను హత్య చేసేదెవరు? ఆ గేమ్‌కు వరస హత్యలకు ఉన్న సంబంధం ఏంటి తదితర విషయాలు తెలియాలంటే దక్ష సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. హారర్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి దక్ష సినిమా ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. మరెందుకు లేటు ఎంచెక్కా ఓటీటీలోనూ, యూబ్యూబ్ లోనూ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.

కాగా దక్ష సినిమా తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు ఆయుష్ తేజ్.

ఇవి కూడా చదవండి

దక్ష సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి