Anasuya Bharadwaj: ఆంటీ అంటావా? దమ్ముంటే స్టేజ్‌పైకి రారా? యాంకర్ అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్.. వీడియో
స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బుల్లితెరను వదిలేసిన ఆమె వెండితెరపైనే ఎక్కువగా దృష్టి సారించింది. సినిమాలు, టీవీషోల సంగతి పక్కన పెడితే.. అనసూయకు డేరింగ్ అండ్ డ్యాషింగ్. ముక్కుసూటి తనం ఎక్కువ. ఏ విషయంలోనైనా సై అంటే సై అంటుంది.

స్టార్ యాంకర్ అనసూయ ఈ మధ్యన సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అడపా దడపా మాత్రమే టీవీషోల్లో సందడి చేస్తుంటుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. తన సోషల్ మీడియా పోస్టులపై ట్రోల్స్ వచ్చినా అస్సలు వెనక్కు తగ్గదీ అందాల తార. తనను విమర్శించే వారికి తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూనే ఉంటుంది. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. శుక్రవారం (మార్చి 15) దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఈ వేడుకల్లో భాగమయ్యారు. తమ కుటుంబీకులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి రంగుల పండగలో మునిగి తేలారు. అలా అనసూయ కూడా ఒక హోలీ ఈవెంట్ లో పాల్గొంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్‌గా వెళ్లిందామె. అయితే అక్కడ ఓ ఆకతాయి అనసూయను ఆంటీ అని పిలిచాడు. అంతే.. ఆ మాట చెవిన పడటంతో అనసూయకు చిర్రెత్తిపోయింది. అందరి ముందే ఆ ఆకతాయికి స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చింది. దమ్ముంటే స్టేజీపైకి రా అని సవాల్ విసిరింది. నన్ను రెచ్చగొడితే ఎలా ఉంటుందో నీకు చూపిస్తా అని ధమ్కీ ఇచ్చింది. ఏంటీ భయంతో ప్యాంటు తడిసిపోతుందా? అయితే వాష్‌రూమ్‌కు వెళ్లు అన్నట్లుగా సైగ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.
ఈ వీడియోను చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఆమెను ఎందుకలా ఆంటీ అని పిలుస్తున్నారు? తనకు నచ్చదు అని చెప్పిన తరువాత కూడా అలాగే ఎందుకు పిలుస్తున్నారంటూ హిత బోధ చేస్తున్నారు. మరికొందరేమో అనసూయకు వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతున్నారు. జనాలు మారరు.. అనసూయ తగ్గదంటున్నారు మరికొందరు. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది.
ఆకతాయికి వార్నింగ్ ఇస్తోన్న అనసూయ.. వీడియో..
దమ్ముంటే స్టేజ్ మీదకు “రారా”..
టాలివుడ్ నటి అనసూయ!#Tollywood #Celebrity #Anasuya #UANow #Culture pic.twitter.com/Q2FgbUhkFn
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) March 15, 2025
హరి హర వీర మల్లు సినిమాలో అనసూయ..
Language doesn’t matter when the energy is this electrifying 😎🔥
Watch Powerstar @PawanKalyan bring his signature swag and @AgerwalNidhhi‘s radiant presence in the #HariHaraVeeraMallu second single! 💥💥#HHVM 2nd single 𝐓𝐑𝐄𝐍𝐃𝐈𝐍𝐆 𝐓𝐎𝐏 on #YouTube -… pic.twitter.com/qVxqBxeEbd
— Hari Hara Veera Mallu (@HHVMFilm) February 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








