AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonakshi Sinha: హోలీ వేడుకల్లో సోనాక్షి.. నీ భర్త ఎక్కడంటూ నెటిజన్ల ట్రోలింగ్.. హీరోయిన్ ఆన్సర్ ఏంటంటే?

పెళ్లి తర్వాత బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఒంటరిగా ఎందుకు హోలీ జరుపుకుంది? ఆమె భర్త జహీర్ ఇక్బాల్ ఎక్కడ? అంటూ నెటిజన్లు బాలీవుడ్ హీరోయిన్ ను ట్రోల్ చేశారు. అయితే ఈ ట్రోల్స్, ప్రశ్నలన్నింటికీ తగిన సమాధానం ఇచ్చింది సోనాక్షి సిన్హా.

Sonakshi Sinha: హోలీ వేడుకల్లో సోనాక్షి.. నీ భర్త ఎక్కడంటూ నెటిజన్ల ట్రోలింగ్.. హీరోయిన్ ఆన్సర్ ఏంటంటే?
Sonakshi Sinha
Basha Shek
|

Updated on: Mar 15, 2025 | 9:23 PM

Share
ఇవి కూడా చదవండి

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ హోలీ పండుగను ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు తమ హోలీ వేడుకల ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అయితే ఇదే హోలీ ఫోటోలను షేర్ చేసినందుకు ఒక స్టార్ హీరోయిన్ ట్రోలింగ్ కు గురైంది. ఆమె మరెవరో కాదు మతాంతర వివాహం చేసుకున్న బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా. చాలా మంది లాగే ఆమె హోలీ ఆడుతున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో చాలా మంది నెటిజన్లు హీరోయిన్ కు హోలీ విషెస్ చెప్పారు. అదే సమయంలో కొందరు నెటిజన్లు మాత్రం ఆమెను ట్రోల్ చేశారు. నెగెటివ్ కామెంట్స్ తో చిరాకు తెప్పించారు. దీనికి కారణం ఆ ఫోటోలలో సోనాక్షి ఒంటరిగా హోలీ ఆడుతూ కనిపించడమే. తన వెంట భర్త జహీర్ ఇక్బాల్ కనిపించకపోవడంతో నెటిజన్లు సోనాక్షిపై ప్రశ్నల వర్షం కురిపించారు. నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేశారు.

సోనాక్షి సిన్హా తన చిరకాల ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను జూన్ 23, 2024న వివాహం చేసుకుంది. ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందినవారు. అందుకే వారిద్దరూ తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇది సోనాక్షి వివాహం తర్వాత జరుపుకున్న మొదటి హోలీ. జహీర్ తో ఆమె ఫోటోల కోసం జనాలు ఎదురు చూస్తున్నారు, కానీ సోనాక్షి తన మొదటి హోలీని ఒంటరిగా జరుపుకుంది. ఈ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత ఈ జంటపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. సోనాక్షి తన అభిమానులకు ఫోటోలతో హోలీ శుభాకాంక్షలు తెలిపింది, కానీ ఆమె ఒంటరిగా హోలీ ఎందుకు ఆడుతున్నారు? జహీర్ ఆమెతో ఎందుకు హోలీ ఆడటం లేదు వంటి అనేక ప్రశ్నలు అడిగారు.

హోలీ వేడుకల్లో సోనాక్షి..

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona)

చాలా మంది నెటిజన్లు జహీర్ ఎక్కడ అని ప్రశ్నలు అడిగారు. కొంతమంది ‘అతను రంజాన్ జరుపుకోవడానికి వెళ్లి ఉంటాడు’ అని చిరాకు తెప్పించారు. దీంతో చివరకు, సోనాక్షి ఈ ట్రోల్స్ అన్నింటికీ తగిన సమాధానం ఇచ్చింది. ‘‘హోలీ వచ్చేసింది. హ్యాపీ హోలీ. రంగులు చల్లండి. సంతోషాన్ని పంచండి. నేను ప్రస్తుతం ‘జటాధర’ షూట్‌లో ఉన్నాను. ఈ సెట్‌లోనే హోలీ వేడుకలు చేసుకున్నాను. . కామెంట్స్‌ చేసే వారందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి. జహీర్‌ ప్రస్తుతం ముంబయిలో ఉన్నాడు. మేమిద్దరం ఒకే చోట లేకపోవడం వల్ల హోలీ వేడుకలు కలిపి చేసుకోలేకపోయాం. మా గురించి ఆలోచించి మీ తలలు వేడెక్కి ఉండొచ్చు. తలపై కాస్త నీళ్లు చల్లుకోండి’’ అని కౌంటర్‌ ఇచ్చింది సోనాక్షి.

భర్తతో సోనాక్షి సిన్హా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..