Aamir Khan: ఇద్దరి మధ్య అంత ఏజ్ గ్యాప్ ఉందా? ఆమిర్ ఖాన్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ గౌరి గురించి ఆసక్తికర విషయాలు
తన 60వ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తన కొత్త స్నేహితురాలు గౌరీని పరిచయం చేశాడు. వారిద్దరూ 25 సంవత్సరాలుగా ఒకరినొకరు తెలుసు. అయితే ఏడాదిన్నర క్రితమే తిరిగి కలిశారు. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ సినిమా పరిశ్రమలో విజయం సాధించి ఉండవచ్చు. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే రెండు సార్లు వివాహం చేసుకున్న ఆయన ఇద్దరి భార్యలతోనూ విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఆమిర్ ఖాన్ కి కొత్త స్నేహితురాలు దొరికింది. ఆమె పేరు గౌరి . తన 60వ పుట్టినరోజు సందర్భంగా కొత్త స్నేహితురాలిని పరిచయం చేశాడీ స్టార్ హీరో. దీంతో గౌరి పేరు ఇప్పుడు నెట్టింట మార్మోగిపోతోంది. ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె వయసు తదితర విషయాలను తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజన్లు. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా వీరిద్దరి ఏజ్ గ్యాప్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తు నచర్చ జరుగుతోంది. ఆమిర్ ఖాన్ 1965వ సంవత్సరం మార్చి 14 జన్మించాడు. అదేవిధంగా, గౌరి 1978న ఆగస్టు 21 జన్మించింది. అంటే ఇద్దరి మధ్య దాదాపు 14 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉందన్న మాట. ఇప్పుడు ఈ విషయం గురించి బాలీవుడ్ లో చాలా చర్చ జరుగుతోంది.
గౌరీ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థలో పని చేస్తోంది. బెంగళూరులో నివసించే గౌరీ, స్టైలిస్ట్‌గా మంచి గుర్తింపు పొందిన రీటా స్ప్రాట్ కుమార్తె. ఆమె తల్లి తమిళియన్ కాగా, తండ్రి ఐరిష్. బ్లూ మౌంటెన్ స్కూల్ లో చదువుకున్న గౌరీ, తరువాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. ఆ తర్వాత లండన్ యూనివర్సిటీలో స్టైలింగ్, ఫోటోగ్రఫీ కోర్సు పూర్తి చేసింది. గతంలో గౌరీకి ఐర్లాండ్‌కు చెందిన ఒక వ్యక్తితో పెళ్లయింది. అయితే ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం కుమారుడితో కలిసి జీవిస్తోంది గౌరి.
ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావుతో గౌరి.. వీడియో..
Watch: Aamir Khan’s GF Gauri Spratt Seen Along with Kiran Rao Attend Irfan Pathan’s Anniversary Bash!#AamirKhan #GauriSpratt #KiranRao #IrfanPathan #AnniversaryBash #CelebrityParty #BollywoodEvents #Bengaluru #Krrish4 #KalkiAvtarArrived #ViratKohli𓃵 #IPL2025 #NorthIndia… pic.twitter.com/FTswJ0I29S
— Vayam Bharat (@vayambharat) March 15, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..