AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Emergency OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కంగన కాంట్రవర్సీ సినిమా.. ‘ఎమర్జెన్సీ’ ఎక్కడ చూడొచ్చంటే?

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎమర్జెన్సీ'. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ 1975లో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు కంగనా. రిలీజ్ కు ముందే ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న మూవీ ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

Emergency OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కంగన కాంట్రవర్సీ సినిమా.. 'ఎమర్జెన్సీ' ఎక్కడ చూడొచ్చంటే?
Emergency Movie
Basha Shek
|

Updated on: Mar 14, 2025 | 9:32 AM

Share

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎమర్జెన్సీ. ఈ చిత్రానికి కంగనా దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాన బాధ్యతలను కూడా భుజానకెత్తుకున్నారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ 1975లో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా కంగనా ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో రిలీజ్ కు ముందే ఈ సినిమా వివాదాల్లో నిలిచింది. పలు మార్లు వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. కొన్ని చోట్ల బాగానే ఆడినా మరి కొన్ని చోట్ల జనాలు ఈ మూవీని పెద్దగా పట్టించుకోలేదు. కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు. రూ.60 కోట్లతో ఎమర్జెన్సీ సినిమాను తెరకెక్కించగా.. కేవలం రూ.21 కోట్లు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు తెలిపారు. కలెక్షన్ల సంగతి పక్కన పెడితే.. సినిమాలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా ఆహర్యం, అభినయం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఎమర్జెన్సీ సినిమా ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఎమర్జెన్సీ సొంతం చేసుకుంది. మార్చి 17న స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానున్నట్లు కంగనానే స్వయంగా ప్రకటించింది. అయితే ఇప్పుడు అనుకున్న సమయంకంటే ముందే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ కూడా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.

ప్రస్తుతం ఎమర్జెన్సీ సినిమా హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అయితే త్వరలోనే తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కు రావొచ్చని సమాచారం. ఎమర్జెన్సీ సిఇనమాలో ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ నటించగా, జయప్రకాశ్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయీగా శ్రేయాస్‌ తల్పడే నటించారు. వీరితో పాటు మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

  కంగనా ప్రత్యేక పూజలు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..