AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: ఊటీలోని చాక్లెట్‌ ఫ్యాక్టరీలో రాహుల్‌ గాంధీ సందడి.. చాకెట్లు తయారు చేయడం నేర్చుకుని ఎంజాయ్ చేసిన..

నిత్యం పాలిటిక్స్‌లో బిజీగా ఉండే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ గత కొంతకాలంగా ప్రజలతో మమేకం అవుతున్నారు. వరుస టూర్లతో సందడి చేస్తున్నారు. స్థానిక జనంతో కలిసి సందడి చేస్తున్నారు. తాజాగా ఊటీలోని చాక్లెట్‌ ఫ్యాక్టరీని సందర్శించిన రాహుల్‌గాంధీ.. అక్కడ కార్మికులతో కలిసి చాక్లెట్‌ ఎలా తయారు చేస్తారో నేర్చుకున్నారు.

Rahul Gandhi: ఊటీలోని చాక్లెట్‌ ఫ్యాక్టరీలో రాహుల్‌ గాంధీ సందడి.. చాకెట్లు తయారు చేయడం నేర్చుకుని ఎంజాయ్ చేసిన..
Rahul Gandhi Makes Chocolates
Surya Kala
|

Updated on: Aug 28, 2023 | 8:33 AM

Share

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గత కొంతకాలంగా ప్రజలతో మమేకం అవుతున్నారు. వరుస టూర్లతో సందడి చేస్తున్నారు. స్థానిక జనంతో కలిసి సందడి చేస్తున్నారు. తాజాగా ఊటీలోని చాక్లెట్‌ ఫ్యాక్టరీని సందర్శించిన రాహుల్‌గాంధీ.. అక్కడ కార్మికులతో కలిసి చాక్లెట్‌ ఎలా తయారు చేస్తారో నేర్చుకున్నారు. అవును నిత్యం పాలిటిక్స్‌లో బిజీగా ఉండే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. ఊటీలో సందడి చేశారు. వయనాడ్‌ వెళ్తూ.. మార్గం మధ్యలో ఊటీలోని ఓ చాక్లెట్‌ ఫ్యాక్టరీని సందర్శించారు.

ఆ చాక్లెట్‌ ఫ్యాక్టరీ సక్సెస్ ఫుల్ గా నడిస్తోందని.. అక్కడ పనిచేస్తున్నవారంతా మహిళలే అని తెలుసుకున్నారు రాహుల్ గాంధీ. అంతేకాదు మహిళపై ప్రశంసల వర్షం కురిపించారు. సుమారు 70 మంది మహిళలు ఆ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. చాక్లెట్‌ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న చాకెట్లు రుచి చూసిన రాహుల్ గాంధీ.. వాటి టెస్టుకు వావ్ అన్నారు. రాహుల్ గాంధీ చాకోలెట్ ఫ్యాక్టరీలో ఉన్నప్పుడు వీడియోను రాహుల్ గాంధీ స్వయంగా షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఫ్యాక్టరీలో పనిచేసే మహిళలతో రాహుల్ ముచ్చటించారు. ఫ్యాక్టరీలో చాక్లెట్ తయారీ విధానాన్ని తెలుసుకున్నారు. అంతేకాదు చాక్లెట్ ను రాహుల్ గాంధీ ఆ మహిళలతో కలిసి  తయారు చేశారు. ఆ సమయంలో ఈ ఫ్యాక్టరీపై ఎంత జీఎస్టీ విధిస్తారో రాహుల్ ఫ్యాక్టరీ యజమాన్యంను ప్రశ్నించారు.

18శాతం జీఎస్టీ కడుతున్నట్లు తెలుసుకున్న రాహుల్.. ఈ సమస్య మీ ఒక్కరిదే కాదని.. దేశం మొత్తానికి సంబంధించిందని అన్నారు. అనంతరం ఓ చిన్నారి నుంచి రాహుల్ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. మోడిస్ చాక్లెట్ల కథ భారతదేశం యొక్క సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల గొప్ప సామర్థ్యానికి ఒక గొప్ప సాక్ష్యం అని రాహుల్ చెప్పారు. మరోవైపు ఇటీవల లద్దాఖ్‌లో తొలిసారి పర్యటించిన రాహుల్‌ గాంధీ.. బైక్‌ రైడ్‌ చేపట్టారు. లద్దాఖ్‌ పాంగాంగ్‌ సరస్సు వరకు బైక్‌ ర్యాలీ చేపట్టారు. స్పోర్ట్స్‌బైక్‌ను నడుపుతూ రాహుల్‌ ఎంజాయ్‌ చేశారు. లద్దాఖ్‌లో తొలుత రెండు రోజుల పాటు పర్యటించాలని అనుకున్న ఆయన తన పర్యటనను పొడిగించుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
డీజీపీ ఆఫీస్ డీఎస్పీ ఇంట్లో ఏసీబీ కలకలం..!
డీజీపీ ఆఫీస్ డీఎస్పీ ఇంట్లో ఏసీబీ కలకలం..!
ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ..
డబుల్ చిన్‌తో బాధపడుతున్నారా?ఈ ఎక్సర్‌సైజెస్‌తో పర్ఫెక్ట్ జా లైన్
డబుల్ చిన్‌తో బాధపడుతున్నారా?ఈ ఎక్సర్‌సైజెస్‌తో పర్ఫెక్ట్ జా లైన్
ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు.. ఇటు అమ్మాయిని.. అటు తల్లిని నమ్మించి..
ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు.. ఇటు అమ్మాయిని.. అటు తల్లిని నమ్మించి..
వర్షాకాలం రాగానే రంగు మార్చే కప్పలు.. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో
వర్షాకాలం రాగానే రంగు మార్చే కప్పలు.. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో
అంతులేని అలసట, నీరసంకు చెక్ పెట్టే కాల్చిన బీట్రూట్ పచ్చడి
అంతులేని అలసట, నీరసంకు చెక్ పెట్టే కాల్చిన బీట్రూట్ పచ్చడి
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్, పోలీసుల అదుపులో హరీశ్‌రావు!
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్, పోలీసుల అదుపులో హరీశ్‌రావు!
విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్.. వారందరికి ఫ్రీగా ల్యాప్‌టాప్స్
విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్.. వారందరికి ఫ్రీగా ల్యాప్‌టాప్స్
సవాళ్లు-ప్రతిసవాళ్లు.. తెలంగాణలో హీటెక్కిన పాలిటిక్స్..
సవాళ్లు-ప్రతిసవాళ్లు.. తెలంగాణలో హీటెక్కిన పాలిటిక్స్..
కడుపులో వేడి వల్ల నోటి పూత వేధిస్తోందా? తేనె, మజ్జిగ, పసుపుతో ఇలా
కడుపులో వేడి వల్ల నోటి పూత వేధిస్తోందా? తేనె, మజ్జిగ, పసుపుతో ఇలా