TIME100 NEXT 2023: టైమ్స్ మ్యాగజైన్ 2023లో భారతీయులు.. క్రికెటర్ హర్మన్ ప్రీత్‌తో సహా ముగ్గురికి చోటు
టైమ్స్ మ్యాగజైన్ 2023 సంవత్సరానికి గాను వంద మంది ప్రపంచ ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాను తాజాగా ప్రకటించింది. ఇందులో ముగ్గురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. ఇండియన్ మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్, జర్నలిస్ట్ నందితా వెంకటేశన్, ఆర్కిటెక్ట్ విను డానియల్‌లు ఈ ఏడాదికి టైమ్స్ మ్యాగజైన్‌లో చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు జాబితాలో భారత సంతతికి చెందిన నాబరన్ దాస్‌గుప్తా..
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: టైమ్స్ మ్యాగజైన్ 2023 సంవత్సరానికి గాను వంద మంది ప్రపంచ ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాను తాజాగా ప్రకటించింది. ఇందులో ముగ్గురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. ఇండియన్ మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్, జర్నలిస్ట్ నందితా వెంకటేశన్, ఆర్కిటెక్ట్ విను డానియల్‌లు ఈ ఏడాదికి టైమ్స్ మ్యాగజైన్‌లో చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు జాబితాలో భారత సంతతికి చెందిన నాబరన్ దాస్‌గుప్తా కూడా ఉన్నారు.
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (34) తన దూకుడైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పంపాదించుకున్నారు. 2017 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 115 బంతుల్లోనే 171 పరుగులు చేసి రికార్డు సాధించారు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌లను విమర్శించినందుకు జులైలో కౌర్‌ను రెండు మ్యాచ్‌లకు సస్పెండ్ చేశారు. అంతేకాకుండా మ్యాచ్ ఫీజులో 75 శాతం జరిమానాగా చెల్లించారు.
జాబితాలో మరొక భారతీయ జర్నలిస్ట్ నందితా వెంకటేశన్ (33) క్షయ వ్యాధి చికిత్స సమయంలో వినియోగించిన టాక్సిక్ కాక్టెయిల్ ఔషధాల ప్రభావంతో వినికిడి శక్తిని కోల్పోయారు. తన మాదిరిగానే వినికిడి శక్తిని కోల్పోయిన దక్షిణాఫిక్రాకు చెందిన ఫుమెజా టిసిలీతో కలిసి సంయుక్తంగా టైమ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఫార్మా కంపెనీ జాన్సన్‌ను మూసివేయాలని భారత ప్రభుత్వానికి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కంపెనీలో క్షయ వ్యాధి మందుల తయారీకి రెండోసారి పేటెంట్‌ను ఇవ్వొద్దని కోరుతూ నందితా, టిసిలీ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ మేరకు భారత ప్రభుత్వం సదరు ఫార్మా కంపెనీ సెకండరీ పేటెంట్‌ను తిరస్కరించింది.
విను డానియల్‌రే వాల్ మేకర్స్ అనే స్టూడియో ఉంది. దీని ద్వారా బురద మట్టి, వ్యర్థ పదార్థాలతో ఇళ్లను నిర్మిస్తున్నారు. సిమెంటు, కాంక్రీటుతో చేపట్టే నిర్మాణాల వల్ల ప్రకృతి విధ్వంసం జరుగుతోందన్నారు. భారత సంతతిరి చెందిన సైంటిస్ట్ నాబరన్ దాస్‌గుప్తా.. ప్రాణాంతకమైన ఓపియాయిడ్ ఓవర్‌డోస్ రివర్సింగ్ డ్రగ్ నలోక్సోన్‌ను మార్కెట్లో విక్రయించకుండా అడ్డుకున్నారు. గతేడాది దేశ వ్యాప్తంగా పంపిణీ అయిన 1.6 మిలియన్ డోసుల వినియోగాన్ని అడ్డుకుని తద్వారా మరణాలు సంభవించకుండా అడ్డుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.