Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Geo-Scientist Jobs 2024: జియో సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే..

యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 56 పోస్టులను గ్రూప్‌ ఎ హోదాతో జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ), మినిస్ట్రీ ఆఫ్‌ మైన్స్‌, సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ వంటి పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జియో సైంటిస్ట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ ఉన్నవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు..

UPSC Geo-Scientist Jobs 2024: జియో సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే..
UPSC
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 26, 2023 | 2:11 PM

యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 56 పోస్టులను గ్రూప్‌ ఎ హోదాతో జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ), మినిస్ట్రీ ఆఫ్‌ మైన్స్‌, సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ వంటి పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జియో సైంటిస్ట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ ఉన్నవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. జియోసైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ ప్రతి యేటా నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి లెవెల్‌-10 వేతనాల కింద మొదటి ఏడాది నుంచే రూ.లక్షకు పైగా జీతం చెల్లిస్తారు.

మొత్తం ఖాళీల వివరాలు..

  • కేటగిరీ 1 జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో.. జియాలజిస్ట్‌ పోస్టులు: 34
  • జియోఫిజిసిస్ట్‌ పోస్టులు: 1
  • కెమిస్ట్‌ పోస్టులు: 13
  • కేటగిరీ 2 సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డులో.. 4 హైడ్రో జియాలజిస్టు పోస్టులు:
  • కెమికల్‌ పోస్టులు: 2
  • జియో ఫిజిక్స్‌ పోస్టులు: 2

ఏయే అర్హతలు ఉండాలంటే..

జియాలజిస్ట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. జియాలజీ/అప్లయిడ్‌ జియాలజీ/ఇంజినీరింగ్‌ జియాలజీ/మెరైన్‌ జియాలజీ/ఎర్త్‌ సైన్స్‌/ఓషనోగ్రఫీ/జియోకెమిస్ట్రీ విభాగంలో పీజీ డిగ్రీ ఉన్నవారు అర్హులు. కెమిస్ట్‌, కెమికల్‌ పోస్టులకు చేసుకునే వారు.. కెమిస్ట్రీ/అప్లయిడ్‌ కెమిస్ట్రీ/ఎనలిటికల్‌ కెమిస్ట్రీ విభాగంలో ఎమ్మెస్సీ చదివినవారు అర్హులు. హైడ్రో జియాలజీ పోస్టులకు జియాలజీ/అప్లయిడ్‌ జియాలజీ/మెరైన్‌ జియాలజీ/హైడ్రో జియాలజీలో పీజీ, జియో ఫిజిక్స్‌, జియో ఫిజిసిస్ట్‌ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎమ్మెస్సీ డిగ్రీ ఉన్నవారు అర్హులు. అలాగే వయసు జనవరి 1, 2024 నాటికి గరిష్ఠంగా 32 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం

స్టేజ్‌-1

ప్రిలిమినరీ, స్టేజ్‌-2 మెయిన్స్‌, స్టేజ్‌-3 ఇంటర్వ్యూ.. ఇలా మూడు స్టేజ్‌లలో నియామక ప్రక్రియ కొనసాగుతుంది. ప్రిలిమినరీ (స్టేజ్‌-1) పరీక్షలో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. క్వశ్చన్‌ పేపర్‌ ఇంగ్లిష్‌ మీడియంలో మాత్రమే ఉంటుందిజ ఓఎంఆర్‌ పత్రంపై సమాధానాలు గుర్తించవల్సి ఉంటుంది. మొత్తం 400 మార్కులకు రెండు పేపర్లు ఉంటాయి. వీటిలో పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌కు వంద మార్కులు. పేపర్‌-2 దరఖాస్తు చేసుకున్న పోస్టు ప్రకారం.. జియాలజిస్ట్‌, హైడ్రో జియాలజిస్ట్‌ పోస్టులకు జియాలజీ/హైడ్రో జియాలజీ విభాగం నుంచి ప్రశ్నలు వస్తాయి. జియో ఫిజిసిస్ట్‌, జియోఫిజిక్స్‌ పోస్టులకు జియో ఫిజిక్స్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అలాగే కెమిస్ట్‌, కెమికల్‌ పోస్టులకు కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్‌-2లో సంబంధిత సబ్జెక్టులో మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 2 గంటల వ్యవధి ఇస్తారు.

ఇవి కూడా చదవండి

స్టేజ్‌-2

స్టేజ్‌-2 డిస్క్రిప్టివ్‌ తరహాలో ఉంటుంది. ఈ క్వశ్చన్‌ పేపర్‌ కూడా ఆంగ్లంలో ఉంటుంది. మెయిన్స్‌లో 3 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కూ 200 చొప్పున 600 మార్కులకు ఉంటుంది. ఒక్కో పేపర్‌కూ 3 గంటల వ్యవధి కేటాయిస్తారు.

స్టేజ్‌-3

ఇంటర్వ్యూకు 200 మార్కులకు ఉంటుంది. అభ్యర్థులు అన్ని దశల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం తుది ర్యాంక్‌ కేటాయిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 10, 2024 సాయంత్రం 6 గంటల వరకు
  • ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 18, 2021
  • మెయిన్‌ పరీక్ష తేదీ: జూన్‌ 22, 2024.

మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.