Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నరరూప రాక్షసుడు.. రూ.20 పాన్ మసాలా కోసం బాలికను ఏం చేశాడో తెలుసా..?

20 రూపాయల కోసం ఓ యువకుడు బాలికను పొట్టనబెట్టుకున్నాడు.. పాన్ మసాలా తీసుకురావాలని తానిచ్చిన రూ.20తో ఆ బాలిక చిప్స్ కొనుక్కుందన్న ఆగ్రహంతో ఆమెను దారుణంగా హింసించి చంపేశాడు.. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో వెలుగులోకి వచ్చింది. అలీఘర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన పొరుగున నివసిస్తున్న ఆరేళ్ల బాలికను కొట్టి చంపాడు.

నరరూప రాక్షసుడు.. రూ.20 పాన్ మసాలా కోసం బాలికను ఏం చేశాడో తెలుసా..?
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 28, 2023 | 1:16 PM

20 రూపాయల కోసం ఓ యువకుడు బాలికను పొట్టనబెట్టుకున్నాడు.. పాన్ మసాలా తీసుకురావాలని తానిచ్చిన రూ.20తో ఆ బాలిక చిప్స్ కొనుక్కుందన్న ఆగ్రహంతో ఆమెను దారుణంగా హింసించి చంపేశాడు.. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో వెలుగులోకి వచ్చింది. అలీఘర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన పొరుగున నివసిస్తున్న ఆరేళ్ల బాలికను కొట్టి చంపాడు. పాన్ మసాలా తీసుకురావాలని నిందితుడు ఆమెను పంపించాడు. అయితే, ఆ బాలిక చిప్స్ కొనుక్కుంది. దీంతో ఆ యువకుడు ఆమెను చంపినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. అలీఘర్ ప్రాంతంలోని ఒక కాలనీలో నివసిస్తున్న బాలిక మంగళవారం రాత్రి కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికారు.. ఎంత వెతికిన కనిపించకపోవడంతో.. ఆమె అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాలిక ఇంటి చుట్టూ అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడం ప్రారంభించారు. ఈ కెమెరాలలో ఒకదానిలో ఒక అమ్మాయి కనిపించింది. ఇందులో, ఆమె తన పొరుగువారి ఇంట్లోకి ప్రవేశించినట్లు కనిపిస్తుంది. కానీ తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన పోలీసులు ఇంట్లో సోదాలు చేశారు. ఈ సమయంలో బాలిక మృతదేహాన్ని వెలికితీశారు.

దీంతో పోలీసులు బాలిక పక్కింటి వ్యక్తిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. విచారణలో నిందితుడు జరిగిన ఘటన గురించి పోలీసులకు చెప్పాడు. తానే ఆ బాలికను చంపినట్లు అంగీకరించాడు. బాలికకు రూ.20 ఇచ్చి పాన్ మసాలా కొనేందుకు సమీపంలోని దుకాణానికి పంపినట్లు పోలీసులకు తెలిపాడు. అయితే అక్కడినుంచి తిరిగి వచ్చేసరికి ఆ అమ్మాయి చేతిలో పాన్ మసాలా లేదు.. ఆ డబ్బుతో చిప్స్ కొనుక్కున్నట్లు తెలిపాడు. దీంతో బాలికను మందలించానని.. ఆమె తిరిగి గొడవకు దిగిందని.. ఈ సమయంలో మొదట బాలికను కొట్టి, ఆపై గొంతు కోసి చంపినట్లు పోలీసులకు తెలిపాడు.

బాలిక కోసం వెతుకుతున్న పోలీసులు తన ఇంటికి వచ్చినప్పుడు బాలిక మృతదేహాన్ని పారవేయబోతున్నట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని నగర ఎస్పీ మృగాంక్ శేఖర్ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రంగుల దుస్తుల్లో రంగమ్మత్త.. అనసూయ అందాలు చూస్తే అసూయపుట్టదా!
రంగుల దుస్తుల్లో రంగమ్మత్త.. అనసూయ అందాలు చూస్తే అసూయపుట్టదా!
నిన్నేమో చిట్టి పొట్టుగౌన్..నేడు ఏకంగా సూటు,బూటులో దిశా పటాని!
నిన్నేమో చిట్టి పొట్టుగౌన్..నేడు ఏకంగా సూటు,బూటులో దిశా పటాని!
ప్రతి తొక్కకి ఒకరోజు వస్తుందంటే ఇదే..పడేశారో ఆస్తులన్నీఅమ్మకానికే
ప్రతి తొక్కకి ఒకరోజు వస్తుందంటే ఇదే..పడేశారో ఆస్తులన్నీఅమ్మకానికే
ఉచిత టికెట్ల గొడవ.. SRH, HCA మధ్య రగులుతున్న చిచ్చు!
ఉచిత టికెట్ల గొడవ.. SRH, HCA మధ్య రగులుతున్న చిచ్చు!
హీరో ప్రభాస్ పీఆర్వోపై పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?
హీరో ప్రభాస్ పీఆర్వోపై పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?
చెమట వాసన వదలడంలేదా.. ఇలా చేసి చూడండి
చెమట వాసన వదలడంలేదా.. ఇలా చేసి చూడండి
రాత్రి కలలు ఉదయాన్నే గుర్తుకొస్తే.. మీ ఆరోగ్యం ఇలా ఉందని సంకేతం!
రాత్రి కలలు ఉదయాన్నే గుర్తుకొస్తే.. మీ ఆరోగ్యం ఇలా ఉందని సంకేతం!
మహిళలదే అగ్రస్థానం.. గ్రూప్ -1 జనరల్ ర్యాంకింగ్స్ విడుదల
మహిళలదే అగ్రస్థానం.. గ్రూప్ -1 జనరల్ ర్యాంకింగ్స్ విడుదల
సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై పిల్ కొట్టేసిన న్యాయస్థానం..
సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై పిల్ కొట్టేసిన న్యాయస్థానం..
దేశసేవకు స్మృతి మందిర్ ప్రేరణ.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..
దేశసేవకు స్మృతి మందిర్ ప్రేరణ.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..