Andhra Pradesh: 30 ఏళ్లుగా రోడ్డు పక్కనే బజ్జీల వ్యాపారం..! నేడు వైభవంగా వృద్ధ దంపతుల వ్యాపార విరమణ మహోత్సవం

వ్యాపార విరమణ మహోత్సవం..! మీరు చదివింది కరెక్టే.. పదవీ విరమణ మహోత్సవం కాదు వ్యాపార విరమణ మహోత్సవం. ప్రతి ఉద్యోగి తన ఉద్యోగాన్ని కర్తవ్య దీక్షతో చేసి 30 సంవత్సరాల తర్వాత పదవి విరమణ చేయడం ప్రతి ఉద్యోగి లక్షణం. అదే కర్తవ్యంతో వ్యాపార విరమణ మహోత్సవం చేసుకుంటున్నారు ఆత్మకూరు పట్టణానికి చెందిన ఓ దంపతులు. వివరాల్లోకి వెళ్లే.. సింహాద్రి రమేష్ కుమార్ కళ్యాణమ్మ అనే దంపతులు గత 30 సంవత్సరాల నుంచి

Andhra Pradesh: 30 ఏళ్లుగా రోడ్డు పక్కనే బజ్జీల వ్యాపారం..! నేడు వైభవంగా వృద్ధ దంపతుల వ్యాపార విరమణ మహోత్సవం
Mirchi Bajji Vendor In Nandyala
Follow us

| Edited By: Srilakshmi C

Updated on: Oct 01, 2023 | 10:32 AM

ఆత్మకూరు, అక్టోబర్‌ 1: వ్యాపార విరమణ మహోత్సవం..! మీరు చదివింది కరెక్టే.. పదవీ విరమణ మహోత్సవం కాదు వ్యాపార విరమణ మహోత్సవం. ప్రతి ఉద్యోగి తన ఉద్యోగాన్ని కర్తవ్య దీక్షతో చేసి 30 సంవత్సరాల తర్వాత పదవి విరమణ చేయడం ప్రతి ఉద్యోగి లక్షణం. అదే కర్తవ్యంతో వ్యాపార విరమణ మహోత్సవం చేసుకుంటున్నారు ఆత్మకూరు పట్టణానికి చెందిన ఓ దంపతులు. వివరాల్లోకి వెళ్లే..

సింహాద్రి రమేష్ కుమార్ కళ్యాణమ్మ అనే దంపతులు గత 30 సంవత్సరాల నుంచి బజ్జీ వ్యాపారం చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో కేజీ రోడ్డు పక్కన ఒక షెడ్‌లో అంటే 1994 సంవత్సరం నుంచి బజ్జీల బండి నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి క్రమశిక్షణతో మంచి నాణ్యత రుచితో వ్యాపార నిబద్ధతతో వ్యాపారం చేసుకుంటూ ఒకే షాపులో వ్యాపారం కొనసాగించారు. అలా తమ ఇద్దరు కూతుళ్లకు మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు రమేష్ దంపతులు. కేవలం బజ్జీల బండితో జీవనం కొనసాగిస్తూ ఇద్దరు కూతుళ్లకు అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు జరిపించి, మనవళ్లు, మనవరాళ్లను చూసుకుంటూ మురిసిపోతున్నారు ఆ దంపతులు.

రమేష్ బజ్జీల బండి పట్టణంలో తెలియని వారు ఉండరు. అంత మంచి నాణ్యత కలిగి ఉంటాయి అక్కడ బజ్జీలు, బోండాలు, వడలు.. ఇక రమేష్‌ భార్య కళ్యాణమ్మ కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ నిత్యం వ్యాపారంలోనే సహకరించేది. ఆమెనే పొయ్యి వద్ద కూర్చుని సరుకు తయారు చేస్తుండగా.. భర్త రమేష్ ఆమె తయారు చేసిన బజ్జీలు, బోండాలు కస్టమర్లకు సప్లై చేస్తుంటాడు. ఎప్పుడు చిరునవ్వుతో కస్టమర్లకు అందిస్తూ 30 సంవత్సరాలుగా ఆత్మకూరు పట్టణవాసుల మన్ననలు అందుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

30 సంవత్సరాలుగా వీరి వ్యాపార జీవనం కొనసాగిస్తున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి వీరి ఆరోగ్య రీత్యా, వయసు రీత్యా వ్యాపారం నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నారు. 30 సంవత్సరాలుగా ఆత్మకూరు పట్టణంలో మంచి పేరుతో తమను అందుకున్నారంతా. తాము కూడా ఓ ఉద్యోగి అయితే ఎలా తమ పదవి నుంచి విరమణ తీసుకునేటప్పుడు బంధువులను, సన్నిహితులను పిలుచుకొని ఎలా అయితే వేడుకగా పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించుకుంటారో.. ఆ విధంగా తన వ్యాపార విరమణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు.

అందుకోసం అక్టోబర్ ఒకటో తేదీ వ్యాపార విరమణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వినూత్నంగా ప్రకటించారు. వీరి ఆలోచన విధానం నచ్చిన తోటి వ్యాపారస్తులు పట్టణంలోని ఆర్యవైశ్యులు ఈ ఫంక్షన్ మరింత గ్రాండ్‌గా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఏది ఏమైనా వీరి ఆలోచన విధానానం వ్యాపారస్తుల్లో సరికొత్త ట్రెండ్ తీసుకువచ్చింది. ఇక నుంచి ప్రతి ఒక్క వ్యాపారి తన వ్యాపార చివరి అంకంలో ఇలా పదవి విరమణ చేసుకోవాలని ఆలోచనకు వస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.