Andhra Pradesh: గిరిజనుల ఈ కష్టాలు తీరేదెన్నడు? గుండె తరుక్కుపోయే వీడియో..
Andhra Pradesh: గిరిజనులకు కష్టాలు తీరడం లేదు, అడవి బిడ్డల అవస్థలకు పరిష్కారం లభించడం లేదు. అల్లూరి జిల్లాలో సరైన రోడ్డు, వాహన సదుపాయం లేక ఏకంగా 5 కిలో మీటర్ల మేర డోలి మోసుకెళ్లారు గ్రామస్తులు. రంపచోడవరం మండలం ఆకూరు పంచాయితీలో గిరిజనుల దీనస్థితి ఇది. అనారోగ్యంతో కింటుకూరు గ్రామ గిరిజన మహిళ జీజీహెచ్‌లో మృతి చెందింది.
Andhra Pradesh: గిరిజనులకు కష్టాలు తీరడం లేదు, అడవి బిడ్డల అవస్థలకు పరిష్కారం లభించడం లేదు. అల్లూరి జిల్లాలో సరైన రోడ్డు, వాహన సదుపాయం లేక ఏకంగా 5 కిలో మీటర్ల మేర డోలి మోసుకెళ్లారు గ్రామస్తులు. రంపచోడవరం మండలం ఆకూరు పంచాయితీలో గిరిజనుల దీనస్థితి ఇది. అనారోగ్యంతో కింటుకూరు గ్రామ గిరిజన మహిళ జీజీహెచ్‌లో మృతి చెందింది. అయితే డెడ్‌బాడీని సొంతింటి తరలించేందుకు రోడ్డు, వాహన మార్గం లేక ఇలా మృతదేహన్ని 5 కిలోమీటర్లు మేర డోలితో మోసుకెళ్లారు గ్రామస్తులు. డెడ్‌బాడీని రంపచోడవరం నుంచి బేస్ క్యాంప్ దగ్గరకు అంబులెన్స్‌లో తరలించి అక్కడ దించేశారు. కింటుకూరు గ్రామానికి రోడ్ మార్గం లేకపోవడంతో డోలిలో మోసుకెళ్లారు గ్రామస్థులు. రంపచోడవరం హెడ్ క్వార్టర్స్ నుంచి 40 కిలోమీటర్లు దూరంలో ఉన్నా తమ సమస్యలకు పరిష్కారం లభించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

