AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: గాంధీ జయంతి రోజున.. కోతికి దొరికిన మద్యం బాటిల్.. ఏం చేసిందంటే ?

అక్టోబరు 2న గాంధీ జయంతి ఉన్న అందరికీ తెలిసిన విషయమే. మహాత్ముడు జన్మించిన ఆ రోజున దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని అబ్కారీ శాఖ మద్యం అమ్మకాలను నిషేధిస్తుంది. అలాగే ముందు రోజు మద్యం షాపులు, బార్లను కూడా సీజ్‌ చేస్తుంది. అయితే గాంధీ జయంతి తర్వాతి రోజున ఆయా షాపులకు వేసినటువంటి సీల్స్‌‌ను తొలగిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్‌లో గాంధీ జయంతి సందర్భంగా ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది.

Watch Video: గాంధీ జయంతి రోజున.. కోతికి దొరికిన మద్యం బాటిల్.. ఏం చేసిందంటే ?
Monkey
Aravind B
|

Updated on: Oct 02, 2023 | 7:14 PM

Share

అక్టోబరు 2న గాంధీ జయంతి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మహాత్ముడు జన్మించిన ఆ రోజున దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని అబ్కారీ శాఖ మద్యం అమ్మకాలను నిషేధిస్తుంది. అలాగే ముందు రోజు మద్యం షాపులు, బార్లను కూడా సీజ్‌ చేస్తుంది. అయితే గాంధీ జయంతి తర్వాతి రోజున ఆయా షాపులకు వేసినటువంటి సీల్స్‌‌ను తొలగిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్‌లో గాంధీ జయంతి సందర్భంగా ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. సోమవారం నాడు ఓ కోతికి మద్యం సీసా చిక్కినటువంటి ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే అది కూడా పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదురుగా చోటు చేసుకోవడం మరోవిశేషం. ఇక వివరాల్లోక్ వెళ్తే.. ఓ కోతి మద్యం సీసాను తెరిచి తాగడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఆ వీడియోలో దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ముందుగా తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆ కోతి ఓ బైక్‌కు అమర్చినటువంటి సంచిలో వెతికింది. అయితే మద్యం సీసా కనిపించడం వల్ల దాన్ని బయటకు తీసింది. దీంతో ఆహారం కోసం అది వెతుకుతున్న క్రమంలోనే దూరం నుంచి ఎవరో బిగ్గరగా అరిచారు. దీంతో తన చేష్టలు చాలించి అక్కడి నుంచి పారిపోయింది ఆ కోతి. దీంతో కిందపడినటువంటి ఆ మద్యం సీసాలను ఓ కానిస్టేబుల్ తిరిగి ఆ బైక్‌ సంచిలో పెట్టేశాడు. అయితే ఆ సీసాలు కానిస్టేబుల్‌‌కి చెందినవేనని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఆ బైక్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదురుగా పార్క్‌ చేయడం వల్ల అది తీవ్ర విమర్శలకు దారితీసింది. డ్రై డేను పాటించకుండా పోలీసులే ఇలా చేయడం ఏంటని కొంతమంది నెటీజనల్లు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ సంఘటనపై కాన్పూర్‌ జాయింట్ కమిషనర్‌ ఆనంద్‌ ప్రకాశ్‌ తన స్పందనను తెలియజేశారు. అసలు ఈ వైరల్ వీడియో తన దృష్టికి రాలేదని పేర్కొన్నారు. అయితే ఎవరి ద్విచక్ర వాహనాల్లో మద్యం సీసాలున్నాయో వెంటనే విచారణ కూడా చేస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గాంధీ జయంతి రోజున అన్ని రాష్ట్రాల్లో కూడా వైన్స్ దుకాణాలు నిషేధిస్తారు. ఎప్పటినుంచో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా ప్రతి  గాంధీ జయంతి సందర్భంగా అక్కడక్కడ అక్రమంగా మద్యాన్ని విక్రయించే ఘటనలు జరుగూనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.