విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పురాతన పెట్టె !! అందులో ??

విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పురాతన పెట్టె !! అందులో ??

Phani CH

|

Updated on: Oct 02, 2023 | 7:46 PM

విశాఖపట్టణం తీరానికి కొట్టుకొచ్చిన ఓ పెద్ద పెట్టె మిస్టరీగా మారింది. తీరానికి సెప్టెంబర్‌ 29న ఓ పెద్ద పురాతన పెట్టె కొట్టుకు వచ్చిందన్న వార్త దావానలంలా వ్యాపించింది. దానిని చూసేందుకు జనం ఎగబడ్డారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం జనంతో కిటకటలాడింది. ఆ పెట్టెలో విలువైన సంపద ఏదో ఉండే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. మరోవైపు లంగర్ వేసే సమయంలో జెట్టీలను ఢీ కొట్టకుండా వాడే చెక్క దిమ్మె అయి ఉంటుందని కొందరంటున్నారు.

విశాఖపట్టణం తీరానికి కొట్టుకొచ్చిన ఓ పెద్ద పెట్టె మిస్టరీగా మారింది. తీరానికి సెప్టెంబర్‌ 29న ఓ పెద్ద పురాతన పెట్టె కొట్టుకు వచ్చిందన్న వార్త దావానలంలా వ్యాపించింది. దానిని చూసేందుకు జనం ఎగబడ్డారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం జనంతో కిటకటలాడింది. ఆ పెట్టెలో విలువైన సంపద ఏదో ఉండే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. మరోవైపు లంగర్ వేసే సమయంలో జెట్టీలను ఢీ కొట్టకుండా వాడే చెక్క దిమ్మె అయి ఉంటుందని కొందరంటున్నారు. వైఎంసీఏ బీచ్‌లోకి పెట్టె కొట్టుకు వచ్చిందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని దానికి కాపలాగా ఉన్నారు. పెట్టెను ఎవరూ ముట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పురావస్తుశాఖ అధికారులు వచ్చి పెట్టెను తెరిచే అవకాశం ఉందని, వారికి ఇప్పటికే సమాచారం అందించినట్టు తెలిపారు. ఇంత భారీ పెట్టె సముద్ర తీరానికి కొట్టుకురావడం ఇదే తొలిసారని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందన్నది మాత్రం మిస్టరీగా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బు చెదలపాలు..

వింతఘటన.. కందగడ్డకు అరటి గెల.. ఎక్కడంటే ??

ఐఫోన్‌ స్టోర్లపై యూత్‌ దాడి.. ఐఫోన్ల దోపిడీకి భారీ స్కెచ్

రైల్లో బెర్త్‌లు ఖాళీ లేవని.. ఓ ప్రయాణికుడి మాస్టర్ ప్లాన్ అదుర్స్

డేరింగ్ ఆపరేషన్.. మంటల్లో చిక్కుకున్న 35 మందిని కాపాడి