ఐఫోన్ స్టోర్లపై యూత్ దాడి.. ఐఫోన్ల దోపిడీకి భారీ స్కెచ్
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఫ్లాష్‌మాబ్ తరహాలో వచ్చిన కొందరు యువకులు పలు దుకాణాలు లూటీ చేసిన ఘటన సంచలనం రేపింది. దాదాపు వందమంది యువకులు పలు స్టోర్లపై ఒకేసారి దాడులు చేసి ఇష్టమొచ్చిన రీతిలో దోచుకున్నారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో మాస్కులు, హుడీలు ధరించి సిటీ సెంటర్లోని స్టోర్లపై యువతీ యువకులు దోపిడీకి తెగబడ్డారు. చేతికి అందినది దోచుకొని అడ్డుకున్న భద్రతా సిబ్బందిపై దాడి చేసి పారిపోయారు.
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఫ్లాష్‌మాబ్ తరహాలో వచ్చిన కొందరు యువకులు పలు దుకాణాలు లూటీ చేసిన ఘటన సంచలనం రేపింది. దాదాపు వందమంది యువకులు పలు స్టోర్లపై ఒకేసారి దాడులు చేసి ఇష్టమొచ్చిన రీతిలో దోచుకున్నారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో మాస్కులు, హుడీలు ధరించి సిటీ సెంటర్లోని స్టోర్లపై యువతీ యువకులు దోపిడీకి తెగబడ్డారు. చేతికి అందినది దోచుకొని అడ్డుకున్న భద్రతా సిబ్బందిపై దాడి చేసి పారిపోయారు. ఓ యాపిల్ స్టోర్‌లోకి ప్రవేశించి.. ఐఫోన్లు, ఐపాడ్‌లతోపాటు ఇతర వస్తువులన్నింటినీ వారు దోచుకొంటున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటివరకు 52 మందిని అరెస్టు చేశారు. వీరిలో కొందరి నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీరంతా సోషల్ మీడియాలో ప్లాన్ చేసి.. ఆ సమన్వయంతోనే ఈ దోపిడీకి పన్నాగం పన్నినట్లు కనిపిస్తోందని నగర ఇన్‌ఛార్జ్ కమిషనర్ జాన్ స్టాన్‌ఫర్డ్ చెప్పారు. నగరం మొత్తం కార్లలో తిరుగుతూ దుకాణాల్లోకి చొరబడ్డారని తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైల్లో బెర్త్‌లు ఖాళీ లేవని.. ఓ ప్రయాణికుడి మాస్టర్ ప్లాన్ అదుర్స్
డేరింగ్ ఆపరేషన్.. మంటల్లో చిక్కుకున్న 35 మందిని కాపాడి
800: సినిమా ఏమో కానీ.. మామూలుగా కష్ట పడలేదు..
‘మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు..’ ఏడుస్తూ గగ్గోలు పెడుతున్న నటి
దారుణం.. నటి అర్చన గౌతమ్ పై దాడి
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

