Green Tea Disadvantages: హెల్త్ కి మంచిదని గ్రీన్ టీ కప్పులు కప్పులు తాగేస్తున్నారా.. ఎన్ని ఇబ్బందులు వస్తాయో తెలుసా!!

గ్రీన్ అంటే అందరికీ తెలుసు. పల్లె టూర్లలో కూడా వీటి వినియోగం బాగా పెరిగింది. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్లందరూ.. కాఫీ, టీలకు బదులుగా గ్రీన్ టీ తాగుతూంటారు. గ్రీన్ టీ తాగడం కూడా హెల్త్ కి చాలా మంచిదని ఎన్నో పరిశోధనలు, ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. గ్రీన్ టీని తరచూ తాగితే స్థూల కాయాన్ని తగ్గించుకోవచ్చు. అయితే ఏదైనా మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం అది విషంగా మారుతుంది. ఇది తెలియక చాలా మంది గ్రీన్ టీ హెల్త్ కి మంచిదని కప్పులు, కప్పులు తాగేస్తూంటారు. గ్రీన్ టీతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో.. అదే విధంగా సైడ్ ఎఫెక్ట్ కూడా ఉన్నాయి. గ్రీన్ టీ ఎక్కువగా..

Green Tea Disadvantages: హెల్త్ కి మంచిదని గ్రీన్ టీ కప్పులు కప్పులు తాగేస్తున్నారా.. ఎన్ని ఇబ్బందులు వస్తాయో తెలుసా!!
Green Tea-హై బీపీ రోగులకు గ్రీన్ టీ బెస్ట్ టీ. గ్రీన్ టీ ఇరుకైన రక్త నాళాలను తెరవడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కాటెచిన్‌లు రక్త నాళాలు తెరుచుకోవడానికి సహాయం చేస్తాయి. తద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 29, 2023 | 8:18 PM

గ్రీన్ అంటే అందరికీ తెలుసు. పల్లె టూర్లలో కూడా వీటి వినియోగం బాగా పెరిగింది. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్లందరూ.. కాఫీ, టీలకు బదులుగా గ్రీన్ టీ తాగుతూంటారు. గ్రీన్ టీ తాగడం కూడా హెల్త్ కి చాలా మంచిదని ఎన్నో పరిశోధనలు, ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. గ్రీన్ టీని తరచూ తాగితే స్థూల కాయాన్ని తగ్గించుకోవచ్చు. అయితే ఏదైనా మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం అది విషంగా మారుతుంది. ఇది తెలియక చాలా మంది గ్రీన్ టీ హెల్త్ కి మంచిదని కప్పులు, కప్పులు తాగేస్తూంటారు. గ్రీన్ టీతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో.. అదే విధంగా సైడ్ ఎఫెక్ట్ కూడా ఉన్నాయి. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకుంటే.. శరీరం పోషకాలను ఎక్కువగా గ్రహించ లేదు. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకుంటే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎసిడిటీ పెరుగుతుంది:

ఖాళీ కడుపుతో గ్రీన్ తీసుకుంటే మంచిదే కానీ.. కొంత మంది గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటి వారు గ్రీన్ టీని పరగడుపున తీసుకోపోవడమే బెటర్.

ఇవి కూడా చదవండి

నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి:

గ్రీన్ టీలో కూడా కెఫిన్ ఉంటుంది. కాబట్టి రోజుకు నాలుగు, ఐదారు సార్లు తాగితే బాడీలోకి కెఫిన్ చేరుతుంది. దీంతో నిద్రలేమి సమస్యలు, నీరసం వంటివి వస్తాయి. కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తీసుకుంటే బెటర్.

ఐరన్ లోపం:

మంచిదని గ్రీన్ టీని ఎక్కువగా తాగితే ఐరన్ లోపాన్ని ఎదుర్కొనాల్సి వస్తుంది. గ్రీన్ టీని అధిక మోతాదులో తీసుకుంటే శరీరం.. ఐరన్ ను గ్రహించలేదు.

ఎముకలు గుల్ల అవుతాయి:

గ్రీన్ టీని అధికంగా తీసుకోవడం వల్ల.. బాడీలో కాల్షియం తక్కువ అవుతుంది. యూరిన్ రూపంలో కాల్షియం బయటకు పోతుంది. దీంతో ఎముకలు బలహీనంగా తయారవుతాయి. ఆ తర్వాత మెల్లగా ఎముకలు గుల్ల బారిపోయే ప్రమాదం ఉంది.

రక్త పోటు:

గ్రీన్ టీని మందులతో పాటు తీసుకుంటే నెర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇవి కాస్తా రక్త పోటుకు దారి తీస్తుంది.

తలనొప్పి వస్తుంది:

గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది కాబట్టి.. దీని వల్ల తలనొప్పి ఎక్కువగా వస్తుంది. దీంతో టానిన్ అనే పదార్థం రిలీజ్ అవుతుంది. దీని వల్ల కళ్లు తిరగడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్