Health Tips: అరటి పండ్లే కాదు, కాయలు కూడా ఆరోగ్యానికి ప్రయోజనకరమే.. ఆహారంలో భాగమైతే గుండెపోటు మీ దరి చేరదు..!
Raw Banana Benefits: నిత్యం తీసుకోవాల్సిన పండ్లలో అరటి పండు కూడా ఒకటి. చాలా మంది అరటి పండ్లనే తీసుకుంటారు, కానీ అరటి కాయలను పట్టించుకోరు. అవి తినడానికి యోగ్యం కానివి అన్నట్లుగా భావిస్తారు. అయితే అరటి పండుతో ఆరోగ్యానికి కలిగిన ప్రయోజనాల మాదిరిగానే అరటికాయతో కూడా కలుగుతాయి. ఇందుకు అరటికాయలోని పోషకాలే కారణమని చెప్పుకోవచ్చు. ఇంతకీ అరటికాయలతో ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..
Updated on: Oct 01, 2023 | 9:17 PM

పోషకాలు: అరటికాయలో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉన్నాయి. అరటి పండ్లను నేరుగా లేదా కూర రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి, డైటరీ ఫైబర్, ప్రోటీన్‌తో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి.

బరువు నియంత్రణ: ముందుగా చెప్పుకున్నట్లు అరటికాయతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇంకా ఇందులోని అధిక స్థాయి రెసిస్టెంట్ స్టార్చ్ ఎక్కువ కాలం కడుపు నిండుగా ఉండేందుకు పనిచేస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.

గుండె ఆరోగ్యం: అరటికాయ ద్వారా శరీరానికి అధిక మొత్తంలో లభించే పొటాషియం రక్త నాళాలు, ధమనులపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా అధిక రక్తపోటు నివారిస్తుంది . ఫలితంగా గుండెపోటు, హార్ట్ స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

షుగర్ కంట్రోల్: అరటికాయ ద్వారా లభించే అధిక స్థాయి విటమిన్ బి6, ఫైబర్ ప్రీ-డయాబెటిక్, డయాబెటిక్ రోగుల రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫలితంగా షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం తప్పుతుంది.

జీర్ణక్రియ: అరటికాయలో డైటరీ ఫైబర్ ఉన్నందున ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి, కడుపు సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. ఫలితంగా మలబద్ధకం, అజీర్తి, కడుపు నొప్పి వంటి సమస్యలు దూరం అవుతాయి.




