Pistachio Benefits: బ్రెయిన్ యాక్టీవ్ గా ఉండాలంటే పిస్తాను తినండి.. ఇంకా చాలా బెనిఫిట్స్!!
మనం తినే రక రకాల నట్స్ లలో పిస్తా పప్పులు కూడా ఒకటి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్లు అనేవి ఎక్కువగా మనకు లభ్యమవుతాయి. గుండె, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు, అధిక బరువును తగ్గించేందుకు కూడా ఈ పిస్తా పప్పు హెల్ప్ చేస్తాయి. పిస్తా పప్పుతో ఒక్కటేంటి.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే చాలా మంది ఇవి తింటే బరువు పెరుగుతారు, బాడీలో కొవ్వు పెరుగుతుందని దూరంగా పెడతారు. కానీ వీటిని తక్కువ..
మనం తినే రక రకాల నట్స్ లలో పిస్తా పప్పులు కూడా ఒకటి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్లు అనేవి ఎక్కువగా మనకు లభ్యమవుతాయి. గుండె, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు, అధిక బరువును తగ్గించేందుకు కూడా ఈ పిస్తా పప్పు హెల్ప్ చేస్తాయి. పిస్తా పప్పుతో ఒక్కటేంటి.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే చాలా మంది ఇవి తింటే బరువు పెరుగుతారు, బాడీలో కొవ్వు పెరుగుతుందని దూరంగా పెడతారు. కానీ వీటిని తక్కువ మోతాదులో తీసుకుంటే బెనిఫిట్సే తప్ప దుష్ప్రభావాలు ఉండవు. అయితే వీటిని ఎంత మోతాదులో తీసుకోవాలి అని చాలా మంది కన్వ్యూజ్ అవుతూ ఉంటారు. రోజూ నాలుగు నుంచి ఐదు పిస్తా పప్పులు తింటే సరిపోతుంది.
బరువు తగ్గుతారు:
పిస్తా పప్పుల్ని తినడం వల్ల బరువు తగ్గుతారు. వీటిల్లో కేలరీలు అనేవి తక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వీటిని హ్యాపీగా తినవచ్చు.
కొలెస్ట్రాల్ దూరం:
పిస్తా పప్పులు తినడం వల్ల బ్లడ్ లో కొలెస్ట్రాల్ స్థాయిలు అనేవి తగ్గుతాయి. దీంతో రక్తం సరఫరా అయ్యే రక్త నాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఉండవు. దాంతో రక్త పోటు వంటి సమస్యలు కూడా దరి చేరవు.
ఎముకలు దృఢంగా ఉంటాయి:
పిస్తాలు తినడం వల్ల ఎముకలు దృఢంగా, బలంగా తయారవుతాయి. చిన్న పిల్లల నుంచి, వయసు పై బడిన వారు కూడా పిస్తా పప్పులను తినడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.
డయాబెటీస్ కంట్రోల్:
డయాబెటీస్ ఉన్నవారు ఏది తినాలన్నా ఇబ్బంది పడుతూంటారు. అలాంటి వారు పిస్తాను హ్యాపీగా తినవచ్చు. ఇందులో టైప్-2 డయాబెటీస్ ను కంట్రోల్ చేసే గుణాలు ఉన్నాయి. కాబ్టటి మధు మేహంతో బాధ పడేవారు పిస్తాను తినవచ్చు. రాత్రి పూట కూడా వీరు పిస్తాలు తీసుకోవచ్చు.
మెదడును యాక్టీవ్ చేస్తాయి:
పిస్తా నట్స్ లో న్యూరో ప్రొటెక్టివ్ యాక్టివిటీ ఉంటుంది. ఇవి మెదడును యాక్టీవ్ గా ఉంచడంలో సహాయం చేస్తాయి. రోజూ నాలుగు నుంచి 5 పప్పులు తింటే బ్రెయిన్ కు సంబంధించి సమస్యలు దరి చేరవు. మతి మరుపు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:
పిస్తా పప్పుల్లో కీమో నివారణ లక్షణాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా.. పలు రకాల క్యాన్సర్ వ్యాధులు దరి చేరనివ్వకుండా చేస్తాయి. క్యాన్సర్ తో పోరాడుతున్న వారు కూడా పిస్తాను తింటే మంచి ఫలితాలు ఉంటాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.