AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: షుగర్ ఉన్న ఆహారాలు ఎక్కువగా తింటున్నారా.. అయితే కిడ్నీలో రాళ్లు పడతాయి జాగ్రత్త!

సాధారణంగా స్వీట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ తింటూ తాగుతూ ఉంటారు. స్వీట్ గా ఉన్న ఆహారాలను తినడానికే చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అవి టేస్టీగా ఉంటాయి కూడా. అయితే తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిదే కానీ.. ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా జరిగిన అధ్యయనం ప్రకారం.. చక్కెర ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో.. కిడ్నీలో రాళ్లు పడే అవకాశాలు కూడా..

Health Tips: షుగర్ ఉన్న ఆహారాలు ఎక్కువగా తింటున్నారా.. అయితే కిడ్నీలో రాళ్లు పడతాయి జాగ్రత్త!
sugary foods
Chinni Enni
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 04, 2023 | 1:00 PM

Share

సాధారణంగా స్వీట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ తింటూ తాగుతూ ఉంటారు. స్వీట్ గా ఉన్న ఆహారాలను తినడానికే చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అవి టేస్టీగా ఉంటాయి కూడా. అయితే తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిదే కానీ.. ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా జరిగిన అధ్యయనం ప్రకారం.. చక్కెర ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో.. కిడ్నీలో రాళ్లు పడే అవకాశాలు కూడా ఉన్నాయట. అమెరికా నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ చేసిన సర్వే ప్రకారం.. ఎవరైతే షుగర్ కలిపిన ఆహారాలు అధికంగా తింటున్నారో.. వారు 88 శాతం కిడ్నీ రాళ్ల సమస్యల బారిన పడుతున్నట్టు గుర్తించారు.

చక్కెర అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల బాడీలో ఆక్సలేట్, క్యాల్షియం వంటి మోతాదులు పెరిగిపోతాయి. ఇవి కాస్తా యూరిన్ లో చేరతాయి. చివరికి అవి చిన్న స్పటికాలు, రాళ్లల్లా మారతాయి. ఇవి మూత్ర పిండాల్లో, మూత్ర నాళాల్లో చేరి రాళ్లుగా ఉండి పోతాయి. కాబట్టి షుగర్ తో తయారు చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. షుగర్ తో చేసిన ఆహారాలకు దూరంగా ఉన్నా ఎలాంటి నష్టం లేదు. తీపి తినాలని ఉంటే మాత్రం బెల్లంతో చేసిన పదార్థాలను తీసుకుంటే మంచిది. షుగర్ తో చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల.. కిడ్నీలో రాళ్ల సమస్యే కాదు ఇంకా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో తెలుసుకుందాం.

శరరీ బరువు:

ఇవి కూడా చదవండి

చక్కెర ఉన్న ఆహార పదార్థాలు ఉండటం వల్ల శరరీ బరువు కూడా పెరుగుతుంది. వెయిట్ పెరగడం వల్ల రక్త పోటు, డయాబెటీస్, థైరాయిడ్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి రక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి చక్కెర అధికంగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండడమే మేలు.

దంత క్షయం:

చక్కెరతో ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల దంత క్షయం కూడా వస్తుంది. దీని వల్ల నోటి సమస్యలు, పళ్ల సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి.

గుండె సమస్యలు:

చక్కెర నిండిన ఆహారాలు తినడం వల్ల బాడీలో ట్రైగ్లిజరైడ్స్ ఏర్పడతాయి. రక్తంలో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో గుండె జబ్బులు కూడా వస్తాయి. కాబట్టి చక్కెర తక్కువగా ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండి.. ఫ్రెష్ పండ్లు, కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!