Diabetes: సన్ లైట్ లో ఉండటం షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయవచ్చా!!
ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఇబ్బంది పడే సమస్యల్లో డయాబెటీస్ కూడా ఒకటి. ముఖ్యంగా టైప్-2 డయాబెటీస్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మారిన లైఫ్ స్టైల్, ఆహార విధానాల్లో మార్పులు రావడం వల్ల డయాబెటీస్ వస్తుంది. ముఖ్యంగా ఆహార విషయంలో, నిద్ర విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ ను కంట్రోల్ చేయడం పెద్ద సమస్య కూడా కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మధు మేహాన్ని కంట్రోల్ చేసే టిప్స్ ని ఎన్నో తెలుసుకున్నాం. ముఖ్యంగా కాకర కాయ రసం.. షుగర్ లెవల్స్ ను బాగా కంట్రోల్ చేస్తుంది. తాజాగా సన్ లైట్ లో ఉండటం వల్ల కూడా డయాబెటీస్ ను..
ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఇబ్బంది పడే సమస్యల్లో డయాబెటీస్ కూడా ఒకటి. ముఖ్యంగా టైప్-2 డయాబెటీస్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మారిన లైఫ్ స్టైల్, ఆహార విధానాల్లో మార్పులు రావడం వల్ల డయాబెటీస్ వస్తుంది. ముఖ్యంగా ఆహార విషయంలో, నిద్ర విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ ను కంట్రోల్ చేయడం పెద్ద సమస్య కూడా కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మధు మేహాన్ని కంట్రోల్ చేసే టిప్స్ ని ఎన్నో తెలుసుకున్నాం. ముఖ్యంగా కాకర కాయ రసం.. షుగర్ లెవల్స్ ను బాగా కంట్రోల్ చేస్తుంది. తాజాగా సన్ లైట్ లో ఉండటం వల్ల కూడా డయాబెటీస్ ను కంట్రోల్ చేయవచ్చని ఇటీవల జరిగిన పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం.
జీవ క్రియ మెరుగు పడుతుంది:
సన్ లైట్ లో ఉండటం వల్ల జీవ క్రియ పెరుగుతుందని దీంతో ఈజీగా మధు మేహాన్ని అదుపులోకి తీసుకు రావడంలో హెల్ప్ చేస్తుందని అధ్యయనం చెబుతోంది. జీవ క్రియ పెరగడం వల్ల తిన్న ఆహారం తిన్నట్టు జీర్ణం అవుతుంది. దీంతో రక్తంలోని షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.
టైప్2 డయాబెటీస్ వచ్చే ఛాన్స్:
మానవ శరీరంపై సూర్య కాంతి పడక పోతే జీవ క్రియపై ప్రభావం చూపుతుందని, ఇది టైప్2 డయాబెటీస్ కి దారిస్తుందని అధ్యయనంలో తేలింది. కాబట్టి వీలైనంత వరకూ సన్ లైట్ లో ఉండాలని నిపుణులు చెబుతున్నారు. సన్ లైట్ లో ఎక్స్ పోజ్ అవ్వడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి తీసుకు రావడమే కాకుండా.. పగటి పూట వెలుతురులో ఉండటం వల్ల బాడీలో జీవ క్రియ పెరుగుతుంది.
ఊబకాయం:
ఊబకాయం వంటి సమస్యలను అరికట్టడంలో కూడా సన్ లైట్ అనేది ఉపయోగ పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:
సహజమైన కాంతిలో ఉండటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తి కూడా లభిస్తుంది. శరీరంపై బ్యాక్టీరియా, క్రిములు ఏమైనా ఉంటే నశిస్తాయి.
కాగా సహజమైన వెలుతురు శరీరానికి తగలడం వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చట. చాలా మంది సన్ లైట్ ఉన్నంత సేపు ఇంట్లోనే ఉంటున్నారు. దీని వల్ల మరిన్ని సమస్యలు వస్తున్నాయట. కృత్రిమ కాంతి వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అనేది లోపిస్తుంది. దీంతో వ్యాధులతో పోరాడే శక్తి లభించదు. తొందరగా జబ్బుల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయని ఇటీవల వెలువడిన అధ్యయనం చెబుతోంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.