AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aloe Vera Benefits: కలబందతో ఇలా చేశారంటే.. మీ జుట్టు వద్దన్నా.. పెరుగుతూనే ఉంటుంది!!

ప్రస్తుతం ఇప్పుడున్న లైఫ్ స్టైల్, తీసుకునే ఆహారం, కాలుష్యం కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. వీటిల్లో జుట్టు రాలే సమస్య కూడా ఒకటి. జుట్టుకు సంబంధించి పలు రకాల ప్రాబ్లమ్స్ తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చుండ్రు, జుట్టు రాలడం, బలహీనంగా మారిపోవడం, జుట్టులో ఎదుగుదల నశించడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ముఖ్య కారణం సరైన పోషకాహారం లేకపోవడం. ఇప్పుడు తీసుకుంటున్న ఆహారంలో కల్తీ, జంక్ ఫుడ్..

Aloe Vera Benefits: కలబందతో ఇలా చేశారంటే.. మీ జుట్టు వద్దన్నా.. పెరుగుతూనే ఉంటుంది!!
Aloe Vera
Chinni Enni
| Edited By: |

Updated on: Oct 04, 2023 | 6:00 PM

Share

ప్రస్తుతం ఇప్పుడున్న లైఫ్ స్టైల్, తీసుకునే ఆహారం, కాలుష్యం కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. వీటిల్లో జుట్టు రాలే సమస్య కూడా ఒకటి. జుట్టుకు సంబంధించి పలు రకాల ప్రాబ్లమ్స్ తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చుండ్రు, జుట్టు రాలడం, బలహీనంగా మారిపోవడం, జుట్టులో ఎదుగుదల నశించడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ముఖ్య కారణం సరైన పోషకాహారం లేకపోవడం. ఇప్పుడు తీసుకుంటున్న ఆహారంలో కల్తీ, జంక్ ఫుడ్ వంటివే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో జుట్టుకు కావాల్సిన పోషకాలు అందడం లేదు. దీంతో జుట్టు నిర్జీవంగా, బలహీనంగా తయారై రాలడం వంటివి జరుగుతున్నాయి. జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి కలబంద చక్కగా పని చేస్తుంది. కల బందలో ఉండే ఔషధ గుణాలు, పోషకాలు కురులకు కావాల్సిన పోషణను అందిస్తాయి. కల బందతో కొన్ని రకాల చిట్కాలు పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడొచ్చు.

జుట్టు రాలే సమస్య నుంచి బయట పడాలంటే:

ఒక గిన్నెలోకి ఐదు స్పూన్ల కొబ్బరి నూనెను తీసుకుని గోరు వెచ్చగా అయ్యేంత వరకూ వేడి చేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేడి అయిన నూనెలో మూడు స్పూన్ల కలబంద గుజ్జును వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ బాగా పట్టించాలి. ఇలా రాత్రంతా ఉంచుకుని ఉదయాన్నే షాంపూతో తల స్నానం చేయవచ్చు. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

సాఫ్ట్ గా ఉండాలంటే:

ఒక గిన్నెలోకి రెండు స్పూన్ల కలబంద గుజ్జును తీసుకోవాలి. ఇందులో రెండు స్పూన్ల ఉల్లిపాయ రసాన్ని వేసుకుని బాగా కలుపు కోవాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని జుట్టుకు బాగా అప్లే చేసుకోవాలి. ఒక గంట తర్వాత షాంపూతో హెడ్ బాత్ చేయవచ్చు. ఇలా చేస్తే జుట్టు మెత్తగా.. పట్టుకుచ్చులా ఉంటుంది.

జుట్టు పెరగాలంటే:

జుట్టు పొడవుగా పెరగాలన్నా.. ఒత్తుగా అవ్వాలన్న కలబంద బాగా హెల్ప్ చేస్తుంది. ముందుగా జుట్టుపై చిక్కులు లేకుండా దువ్వెనతో దువ్వు కోవాలి. ఆ తర్వాత కలబంద గుజ్జును తీసుకుని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. మర్దనా చేసుకోవాలి. ఒక గంట తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లు గట్టి పడి జుట్టు రాలిపోకుండా ఉండడమే కాకుండా పొడుగ్గా, ఒత్తుగా పెరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Follow Us
ప్రోటీన్ షేక్ కాదు.. రోహిత్ శర్మ లేట్ నైట్ ఫేవరేట్ ఫుడ్ ఇదే
ప్రోటీన్ షేక్ కాదు.. రోహిత్ శర్మ లేట్ నైట్ ఫేవరేట్ ఫుడ్ ఇదే
ఐస్‌క్యూబ్‌లతో అద్భుతం.. ఒక్క ఒక్కసారి రాస్తే చాలు..
ఐస్‌క్యూబ్‌లతో అద్భుతం.. ఒక్క ఒక్కసారి రాస్తే చాలు..
భయం పుట్టించే మిస్టీరియస్ హారర్.. ఓటీటీలోకి వచ్చేసింది..
భయం పుట్టించే మిస్టీరియస్ హారర్.. ఓటీటీలోకి వచ్చేసింది..
వారెవ్వా.. బెల్లం గవ్వలు.. ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయి
వారెవ్వా.. బెల్లం గవ్వలు.. ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయి
ఫోన్‌పే డబ్బుల కోసం ఎంతకు తెగించావ్‌రా.. స్నేహితుడిని దారుణంగా..
ఫోన్‌పే డబ్బుల కోసం ఎంతకు తెగించావ్‌రా.. స్నేహితుడిని దారుణంగా..
అద్భుతాలు జరుగుతాయ్.. ఉదయాన్నే బొప్పాయి తింటే శరీరంలో జరిగేదిదే..
అద్భుతాలు జరుగుతాయ్.. ఉదయాన్నే బొప్పాయి తింటే శరీరంలో జరిగేదిదే..
ఆ ఒక్క మాటే రోహిత్ రికార్డ్‌ను బద్దలు కొట్టేలా చేసింది
ఆ ఒక్క మాటే రోహిత్ రికార్డ్‌ను బద్దలు కొట్టేలా చేసింది
ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే బీటలు వారడం ఖాయం!
ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే బీటలు వారడం ఖాయం!
రాత్రికి రాత్రే గణేషుడి మెడలోని నోట్ల దండను కొట్టేసిన కేటుగాళ్లు!
రాత్రికి రాత్రే గణేషుడి మెడలోని నోట్ల దండను కొట్టేసిన కేటుగాళ్లు!
జపాన్‌తో చారిత్రాత్మక మ్యాచ్.. మారిన టీమిండియా ఓపెనర్లు.. ఎవరంటే?
జపాన్‌తో చారిత్రాత్మక మ్యాచ్.. మారిన టీమిండియా ఓపెనర్లు.. ఎవరంటే?