AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oil Side Effects: ఒకసారి వాడిన నూనెను మళ్లీ వాడకూడదా? తిరిగి యూజ్ చేయాలంటే ఈ టిప్స్ పాటించండి!

భారతీయ వంటకాల్లో ఎక్కువగా వినియోగించేది నూనె. ఏం చేయాలన్నా కావాల్సింది నూనె. ఆయిల్ లేకుండా ఏ వంటా పూర్తి కాదు. చిరు తిళ్లు నుంచి పిండి వంటల దాకా నూనె వినియోగం ఎక్కువ. పూర్వం ఏదో వేశామన్న పేరుకు వాడే వారు. అయినా ఎంతో టేస్టీగా ఉండేవి కూరలు. కానీ ఇప్పుడు కేజీలకు కేజీలు పోసి మరి వండేస్తున్నారు. అయితే కొన్ని రకాల పిండి వంటలు చేసేటప్పుడు లేదా నాన్ వెజ్ వేపుళ్లు, పకోడీలు చేసినప్పుడు తప్పకుండా డీప్ ఫ్రై చేస్తూంటారు. అయితే ఒకసారి యూజ్..

Oil Side Effects: ఒకసారి వాడిన నూనెను మళ్లీ వాడకూడదా? తిరిగి యూజ్ చేయాలంటే ఈ టిప్స్ పాటించండి!
Cooking Iol
Chinni Enni
| Edited By: |

Updated on: Oct 04, 2023 | 4:45 PM

Share

భారతీయ వంటకాల్లో ఎక్కువగా వినియోగించేది నూనె. ఏం చేయాలన్నా కావాల్సింది నూనె. ఆయిల్ లేకుండా ఏ వంటా పూర్తి కాదు. చిరు తిళ్లు నుంచి పిండి వంటల దాకా నూనె వినియోగం ఎక్కువ. పూర్వం ఏదో వేశామన్న పేరుకు వాడే వారు. అయినా ఎంతో టేస్టీగా ఉండేవి కూరలు. కానీ ఇప్పుడు కేజీలకు కేజీలు పోసి మరి వండేస్తున్నారు. అయితే కొన్ని రకాల పిండి వంటలు చేసేటప్పుడు లేదా నాన్ వెజ్ వేపుళ్లు, పకోడీలు చేసినప్పుడు తప్పకుండా డీప్ ఫ్రై చేస్తూంటారు. అయితే ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ ని.. మళ్లీ వాడకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతూంటారు. కానీ కొందరు మాత్రం రోజుల తరబడి నిల్వ చేసి ఉపయోగిస్తూంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా ప్రమాదం.

దీంతో ఆ ఆయిల్ ని ఏం చేయాలా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఒకసారి వేడి చేసిన ఆయిల్ లో ఫ్రీ రాడికల్స్ అనేవి పెరుగుతాయి. దీంతో ఈ నూనెను ఉపయోగించడం వల్ల ప్రాణాంతకమైన వ్యాధులు.. గుండె జబ్బులు, క్యాన్సర్లు, డయాబెటీస్, రక్త పోటు వంటివి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలాంటప్పుడు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల తిరిగి ఆ నూనెను ఉపయోగించుకోవచ్చు. ఇలా చేస్తే ఆ నూనె వాడినప్పటికీ మనకు ఎలాంటి హానీ జరగదు. మరి ఆ టిప్స్ ఏంటో చూద్దాం.

తక్కువ మోతాదులో తీసుకోండి:

ఇవి కూడా చదవండి

డీప్ ఫ్రైకి నూనె వేడి చేస్తున్నప్పుడే.. తక్కువ మోతాదులో తీసుకోవాలి. దీంతో నూనె కూడా సేవ్ అవుతుంది.

వడ కట్టాలి:

వాడిన నూనెను తిరిగి వాడాలి అనుకున్నప్పుడు.. డీప్ ఫ్రైకి పెట్టిన నూనెను చల్లారిన తర్వాత వడ కట్టాలి. ఇలా చేస్తే ఆయిల్ శుభ్ర పడుతుంది.

కూరలకు మాత్రమే వినియోగించాలి:

ఒక సారి డీప్ ఫ్రైకి వాడిన నూనెను మళ్లీ డీప్ ఫ్రైకు వాడకూడదు. అలా చేస్తే ఆ నూనె విషంతో సమానం. ఆ నూనెతో చేసిన ఆహారాలు తొందరగా అరగవు. దీని వల్ల జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. అందుకే బయట డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. బయట వేడి చేసిన నూనెనే.. మళ్లీ మళ్లీ వేడి చేస్తూ ఉంటారు. ఇక డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ను కూరలు వండేటప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. అది కూడా రెండు, మూడు రోజుల్లోనే వాడేయాలి. లేదంటే ఆ నూనె ఇక పనికి రాదు.

పొగ రాకుండా నూనె వేడి చేయాలి:

డీప్ ఫ్రై చేసే ముందు దగ్గర ఉండి ఆయిల్ ను వేడి చేసుకోవాలి. ఒకసారి నూనె నుంచి పొగలు వచ్చేంతగా వేడెక్కితే మాత్రం.. ఆ నూనెను మళ్లీ అస్సలు వాడకూడదు.

డీప్ ఫ్రై చేయాలంటే స్టీల్ కడాయి బెస్ట్:

చాలా మంది డీప్ ఫ్రై వంటకాలు చేస్తే ఇనుప కడాయిలో చేస్తారు. మళ్లీ ఆ నూనెను తిరిగి వాడినప్పుడు ఒకలాంటి స్మెల్ వస్తుంది. కాబట్టి డీప్ ఫ్రై చేయాలనుకుంటే మాత్రం ఇనుప కడాయిల్లో చేయకూడదు.

ఇలా పై టిప్స్ ను ఉపయోగించి హ్యాపీగా ఒక సారి యూజ్ చేసిన ఆయిల్ ను మరలా ఉపయోగించుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Follow Us
తొండం లేని వినాయకుడు ఎక్కడ ఉన్నాడు? ప్రపంచంలోనే అరుదైన నరముఖ..
తొండం లేని వినాయకుడు ఎక్కడ ఉన్నాడు? ప్రపంచంలోనే అరుదైన నరముఖ..
ఈ పశువుల డాక్టర్ ఇలా ఎందుకు చేయిస్తున్నారో తెలుసా..?
ఈ పశువుల డాక్టర్ ఇలా ఎందుకు చేయిస్తున్నారో తెలుసా..?
కారవాన్‌లోనే బోర్డు మీటింగ్.. ఏపీ టూరిజం సరికొత్త ఆలోచన
కారవాన్‌లోనే బోర్డు మీటింగ్.. ఏపీ టూరిజం సరికొత్త ఆలోచన
బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్‌ షాప్‌పై కేసు, జరిమానా
బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్‌ షాప్‌పై కేసు, జరిమానా
పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే..
పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్