Papaya Seeds: బొప్పాయి గింజలను పడేస్తున్నారా.. వాటిలో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలుసా!

బొప్పాయి పండు గురించి పరిచయం అవసరం లేదు.. అందరికీ పరిచయమే. అందరూ వీటిని విరివిగా వాడుతూంటారు. అన్ని కాలాల్లో కూడా బొప్పాయి మనకు లభిస్తుంది. పచ్చి బొప్పాయితో హల్వా కూడా చేసుకుని తింటారు. ఇక బొప్పాయి కాయలో కానీ.. ఆకుల్లో కూడా అనే పోషకాలు ఉన్నాయి. బొప్పాయి ఆకుల రసాన్ని తాగితే.. కొద్ది గంటల్లోనే ప్లేట్ లేట్లు పెరుగుతాయి. అంతేకాదు ఈ ఆకుల రసాన్ని వివిధ అనారోగ్య సమస్యలకు కూడా ఉపయోగిస్తూంటారు. అయితే బొప్పాయి..

Papaya Seeds: బొప్పాయి గింజలను పడేస్తున్నారా.. వాటిలో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలుసా!
మీరు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుంటే బొప్పాయిని నివారించండి. ఈ పండులో ఉండే ఎంజైమ్ ఆస్తమా రోగులకు హానికరం. అలాగే, చాలా మంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినకూడదు, ఎందుకంటే ఇది వారికి హానికరం.
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 04, 2023 | 4:30 PM

బొప్పాయి పండు గురించి పరిచయం అవసరం లేదు.. అందరికీ పరిచయమే. అందరూ వీటిని విరివిగా వాడుతూంటారు. అన్ని కాలాల్లో కూడా బొప్పాయి మనకు లభిస్తుంది. పచ్చి బొప్పాయితో హల్వా కూడా చేసుకుని తింటారు. ఇక బొప్పాయి కాయలో కానీ.. ఆకుల్లో కూడా అనే పోషకాలు ఉన్నాయి. బొప్పాయి ఆకుల రసాన్ని తాగితే.. కొద్ది గంటల్లోనే ప్లేట్ లేట్లు పెరుగుతాయి. అంతేకాదు ఈ ఆకుల రసాన్ని వివిధ అనారోగ్య సమస్యలకు కూడా ఉపయోగిస్తూంటారు. అయితే బొప్పాయి పండులోని నల్లని రంగులో చిన్నవి రౌండ్ గా గింజలు కనిపిస్తాయి. ఆ గింజలను పడేసి పండును తింటాం. కానీ బొప్పాయి గింజల వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా. వీటి గురించి తెలిస్తే ఆ గింజల్ని అస్సలు పడేయరు. మరి వాటిలో ఉండే పోషకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణ క్రియను మెరుగు పరుస్తాయి:

బొప్పాయి గింజల్లో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ జీర్ణ క్రియకు చక్కగా తోడ్పడుతుంది. చాలా మంది జీర్ణ క్రియ సమస్యలతో ఇబ్బంది పడుతూంటారు. అలాంటి వారు ఈ బొప్పాయి గింజల్ని తీసుకోవచ్చు. ఇవి తినడం వల్ల మల బద్దకం, ఉబ్బరం, కడుపులో నొప్పి, అజీర్తి వంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

వాపును తగ్గిస్తాయి:

బొప్పాయి గింజల్లో ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ సమ్మేళనాలు అవంటివి ఉంటాయి. వీటి వల్ల శరీరంలో వాపులు ఉంటే వాటిని తగ్గించుకోవచ్చు.

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి:

బొప్పాయి పండు గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మలినాలు, వ్యర్థాలను బయటకు పంపుతాయి.

ఇమ్యూనిటీని పెంచుతాయి:

బొప్పాయి గింజల్లో రోగ నిరోధక శక్తి గుణాలు మెండుగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఇమ్యూనిటీని పెంచి.. వ్యాధులతో పోరాడేందుకు హెల్ప్ చేస్తాయి.

బరువును నియంత్రణలో ఉంచుతుంది:

బొప్పాయి గింజల్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీటితో కలిపిన ఆహారాన్ని కొద్దిగా తిన్నా.. కడుపు నిండిన భావన కలుగుతుంది. కాబట్టి బరువును నియంత్రణలో ఉంచుతుంది.

గుండె ఆరోగ్యంగా ఉంటుంది:

బొప్పాయి గిజంల్లో మోనో శాచురేటెడ్ కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ ను నివారిస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే