Guava Disadvantages: ఈ సమస్యలతో ఇబ్బంది పడేవారు జామ పండుకు దూరంగా ఉంటేనే బెటర్!
జామ పండ్లు అంటే చాలా మందికి ఇష్టం. తినేకొద్దీ తినాలనిపిస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామ పండ్లు తినడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యల నుంచి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. పేదోడి యాపిల్ గా జామ పండుకు పేరొంది. యాపిల్ లో ఎలాంటి ఆరోగ్య గుణాలు ఉన్నాయో.. జామ కాయతో కూడా అలాంటి బెనిఫిట్సే ఉన్నాయి. జామ పండు తినడం బాడీలో కొలెస్ట్రాల్, రక్త పోటు అదుపులో ఉంచుకోవచ్చు. గుండె సమస్యలు కూడా రావు. చర్మం కూడా యంగ్ గా ఉంటుంది. జామ కాయను తినడం వల్ల హెల్త్ కి చాలా మంచిదే అయినప్పటికీ....
జామ పండ్లు అంటే చాలా మందికి ఇష్టం. తినేకొద్దీ తినాలనిపిస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామ పండ్లు తినడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యల నుంచి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. పేదోడి యాపిల్ గా జామ పండుకు పేరొంది. యాపిల్ లో ఎలాంటి ఆరోగ్య గుణాలు ఉన్నాయో.. జామ కాయతో కూడా అలాంటి బెనిఫిట్సే ఉన్నాయి. జామ పండు తినడం బాడీలో కొలెస్ట్రాల్, రక్త పోటు అదుపులో ఉంచుకోవచ్చు. గుండె సమస్యలు కూడా రావు. చర్మం కూడా యంగ్ గా ఉంటుంది. జామ కాయను తినడం వల్ల హెల్త్ కి చాలా మంచిదే అయినప్పటికీ.. కొన్ని రకాల సమస్యలతో ఇబ్బండే వారు దీనికి దూరంగా ఉంటేనే బెటర్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా జామ పండును ఎప్పుడు తింటే మంచిది.. ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇఫ్పుడు తెలుసుకుందాం.
ఈ సమయంలో అస్సలు తినడకూడదు:
జామ పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది అయినా.. వీటిని సాయంత్రం, రాత్రి సమయంలో తీసుకోక పోవడమే మంచిది. ఈ సమయాల్లో తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. దీంతో కడుపులో నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. కాబట్టి జామ కాయను.. ఉదయం, మధ్యాహ్నం హ్యాపీగా తినవచ్చు.
జీర్ణ సమస్యలు ఉన్నవారు:
జామ పండులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకటి కంటే ఎక్కువగా జామ పండ్లను తింటే మల బద్ధకం, కడుపులో నొప్పి, ఉబ్బరం, గ్యాస్ అజీర్తి వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. కాబట్టి జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు దీనికి దూరంగా ఉంటేనే చాలా మంచిది. లేకుంటే ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి.
గుండెల్లో మంట ఉన్నవారు:
జామ పండులో విటమిన్ సి, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు కూడా జామ కాయకు దూరంగా ఉంటేనే మంచిది.
డయాబెటీస్ తో బాధ పడేవారు:
ప్రస్తుతం ఇప్పుడు చాలా మంది డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే షుగర్ వ్యాధితో బాధ పడాల్సి వస్తుంది. మధు మేహం ఉన్న వారు కూడా జామ కాయను చాలా తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి విపరీతంగా పెరుగుతంది.
జలుబు, ఫ్లూ ఉన్నవారు:
ఫ్లూ, జలుబు వంటి ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడే వారు కూడా జలుబుకు దూరంగా ఉండాలి. లేకుండా ఇవి మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
రాత్రి పూట తీసుకోకూడదు:
జామ పండును రాత్రి పూట అస్సలు తీసుకోకూడదు. దీని వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్త వచ్చు. కాబట్టి రాత్రి పూట జామ కాయను దూరంగా ఉంచాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.