Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Socks Benefits: సాక్సులతో అమేజింగ్ బెనిఫిట్స్.. వీటితో ఈ ప్రాబ్లమ్స్ కి చెక్ పెట్టవచ్చు!

సాధారణంగా సాక్సులను ఆఫీసులకు వెళ్లే వారు, స్కూల్ కి వెళ్లే పిల్లలు వారు ధరిస్తూంటారు. కానీ నార్మల్ గా కూడా సాక్సులను ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సాక్సులను వేసుకోవడం వల్ల పాదాలకు రక్త ప్రసరణ బాగా అందుతుంది. అలాగే ఇది గుండె, ఊపిరి తిత్తుల కండరాలను కూడా బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా సాక్సులను ధరించడం వల్ల పాదాలకు రిలాక్స్ గా ఉంటుంది. అంతే కాకుండా పాదాలకు రక్షణగా ఉంటాయి. ఎలాంటి వ్యాధులు..

Socks Benefits: సాక్సులతో అమేజింగ్ బెనిఫిట్స్.. వీటితో ఈ ప్రాబ్లమ్స్ కి చెక్ పెట్టవచ్చు!
Socks
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 10, 2023 | 8:25 AM

సాధారణంగా సాక్సులను ఆఫీసులకు వెళ్లే వారు, స్కూల్ కి వెళ్లే పిల్లలు వారు ధరిస్తూంటారు. కానీ నార్మల్ గా కూడా సాక్సులను ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సాక్సులను వేసుకోవడం వల్ల పాదాలకు రక్త ప్రసరణ బాగా అందుతుంది. అలాగే ఇది గుండె, ఊపిరి తిత్తుల కండరాలను కూడా బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా సాక్సులను ధరించడం వల్ల పాదాలకు రిలాక్స్ గా ఉంటుంది. అంతే కాకుండా పాదాలకు రక్షణగా ఉంటాయి. ఎలాంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. పాదాలకు పగుళ్ల సమస్యలతో ఇబ్బంది పడేవారు సాక్సులను ధరించడం వల్ల సాఫ్ట్ గా ఉంటూనే పగుళ్ల సమస్యను తగ్గిస్తుంది. సాక్సులను ధరించడం వల్ల ఇంకా ఎలాంటి సమస్యలు తగ్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

దుర్వాసనను నిరోధిస్తాయి:

సాధారణంగా మనం బయటకు వెళ్లినప్పుడు లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఆఫీసులో ఉన్నప్పుడు కొందరికి పాదాలకు చెమటలు పడతాయి. చెమట గ్రంథుల వలన పెద్ద మొత్తంలో చెమటను రిలీజ్ చేస్తాయి. చెమట ఎక్కువగా పడితే దుర్వాసన వస్తూ ఉంటుంది. అదే సాక్సులను ధరిస్తే.. ఆ చెమటను అంతా సాక్సులు పీలుస్తాయి. ఫలితంగా దుర్వాసన దూరం అవుతుంది. కాబట్టి సాక్సులు ధరించడం మేలే.

ఇవి కూడా చదవండి

పాదాలకు రక్షణగా ఉంటాయి:

సాక్సులు ధరించడం వల్ల పాదాలకు రక్షణగా ఉంటాయి. గాయాలు, దెబ్బలు తగలకుండా పాదాలకు రక్షణగా నిలుస్తాయి సాక్షులు. కాబట్టి సాక్సులు ధరించడం బెటర్ అని అంటున్నారు నిపుణులు.

ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి:

సాక్సులు ధరించడం వల్ల పాదాలకు రక్షణగా నిలవడమే కాకుండా.. ఎలాంటి వ్యాధులు తొందరగా రాకుండా చేస్తాయి. అప్పుడప్పుడు చెప్పులు లేకుండా నడుస్తూంటారు. ఇలాంటి సమయంలో బ్యాక్టీరియా, క్రిములు పాదాల ద్వారా చేరి వ్యాధులు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి సాక్షులు ధరించడం తొందరగా వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆడుకునే పిల్లలకు ఎక్కువగా సాక్సులు వేయడం వల్ల వారికి తొందరగా వ్యాధులు రాకుండా ఉంటాయి.

మీ పాదాలను అందంగా, సాఫ్ట్ గా ఉంచుతాయి:

సాక్సులు ధరించడం వల్ల మీ పాదాలు మృదువుగా, అందంగా ఉంటాయి. సాధారణంగా చాలా మంది వ్యక్తుల పాదాలు గట్టిగా మారి పగళ్లు ఏర్పడతాయి. ఇలాంటి వారు తరచూ సాక్సులు ధరిస్తే.. సాఫ్ట్ గా పగుళ్లు ఏర్పడకుండా ఉంటాయి. అలాగే సాక్సులు వేసుకోవడం వల్ల.. పాదలు తెల్లగా మారతాయి. ఎందుకుంటే పాదాలపైనే ఎక్కువగా దుమ్ము, ధూళి చేరుతుంది. కాబట్టి ఇలాంటివేమీ చేరకుండా సాక్సులను కాపాడుతాయి కాబట్టి.. తెల్లగా మారతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.