Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic Peel Benefits: వెల్లుల్లి పొట్టును పడేస్తున్నారా.. దానితో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో తెలుసా!

వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే. ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తిన్నా.. లేదా వంటల రూపంలో తీసుకున్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సరైన మోతాదులో వెల్లుల్లిని తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. చర్మానికి, జుట్టుకు, ఆరోగ్యానికి ఇలా చాలా రకాలుగా వెల్లుల్లి మనకు ఉపయోగ పడుతుంది. అయితే వెల్లుల్లి మాత్రమే కాదు వెల్లుల్లి పొట్టు వల్ల కూడా ఎన్నో రకాల..

Garlic Peel Benefits: వెల్లుల్లి పొట్టును పడేస్తున్నారా.. దానితో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో తెలుసా!
Garlic Peel
Follow us
Chinni Enni

| Edited By: Phani CH

Updated on: Oct 06, 2023 | 10:08 PM

వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే. ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తిన్నా.. లేదా వంటల రూపంలో తీసుకున్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సరైన మోతాదులో వెల్లుల్లిని తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. చర్మానికి, జుట్టుకు, ఆరోగ్యానికి ఇలా చాలా రకాలుగా వెల్లుల్లి మనకు ఉపయోగ పడుతుంది. అయితే వెల్లుల్లి మాత్రమే కాదు వెల్లుల్లి పొట్టు వల్ల కూడా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలీదు. వెల్లుల్లిని తీసి దానిపై ఉండే పొట్టును పడేస్తారు. ఈ వెల్లుల్లి పొట్టుని ఇలా కూడా వాడవచ్చా అని షాక్ అవుతారు. చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

టీ చేసుకోవచ్చు:

అదేంటి షాక్ అవుతున్నారా.. అవును వెల్లుల్లి పొట్టుతో టీ కూడా చేసుకోవచ్చు. వెల్లుల్లి పొట్టును నీటిలో వేసి బాగా మరిగించి టీలా తయారు చేసుకోవచ్చు. దీన్ని వడ కట్టి తాగితే.. ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా జీర్ణ సమస్యలు ఉండవు.

ఇవి కూడా చదవండి

స్క్రబర్ లా ఉపయోగించుకోవచ్చు:

చాలా మంది ఫేస్ కి రక రకాల స్క్రబర్స్ ని వాడుతూంటారు. వెల్లుల్లి పొట్టుని కూడా మనం ముఖానిక స్క్రబర్ లా వాడవచ్చు. ఈ పొట్టును పౌడర్ లా చేసుకుని.. అందులో కొద్దిగా పాలు లేదా నీలు కలిపి ఫేస్ కి స్క్రబర్ లా ఉపయోగించుకోవచ్చు.

మట్టి పాత్రలను క్లీన్ చేయవచ్చు:

వెల్లుల్లి పొట్టుతో మట్టి పాత్రలను శుభ్ర పరుచుకోవచ్చు. ఇలా చేస్తే మట్టి పాత్రల్లో ఉండే దుర్వాసన పోతుంది.

బట్టలు ఉండే చోట పెట్టవచ్చు:

సాధారణంగా మనం బట్టలు పెట్టుకునే చోట.. ఈ పొట్టును ఒక కవర్లో వేసి పెడితే.. గాలిలో ఉన్న దుర్వాసన పోతుంది.

ఎరువుగా ఉపయోగించుకోవచ్చు:

కంపోస్ట్ ఎరువులో వెల్లుల్లి పొట్టును కూడా వేసి తయారు చేసుకోవచ్చు. అలాగే ఇంటి వద్ద ఉన్న మొక్కలకు ఎరువుగా ఈ పొట్టును ఉపయోగించుకోవచ్చు.

వంటల్లో ఉపయోగించవచ్చు:

వెల్లుల్లి పొట్టును మిక్సీలో వేసి మెత్తని పౌడర్ లా చేసుకోవాలి. ఈ పొడికి ఉప్పును కలిపి నిల్వ చేసుకోవాలి. దీన్ని వంటల్లో వేసుకుంటూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది.

సలాడ్స్ లో వాడవచ్చు:

ఒక గాజు కంటైనర్ లో కానీ చిన్న జాడీలో కానీ ఆలీవ్ ఆయిల్ వేసుకుని అందులో వెల్లుల్లి పొట్టును కూడా వేసి.. కొన్ని రోజుల పాటు నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని సలాడ్స్ లో యూజ్ చేసుకోవచ్చు. ఆలీవ్ ఆయిల్ ప్లేస్ లో వెనిగర్ ను కూడా ఉపయోగించుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..