Home Decor: ఇంటి గుమ్మం ఎదురుగా ఇలాంటి వస్తువులను పెడుతున్నారా.. చాలా నష్టం జరుగుతుంది!
ఇంటి ఎంట్రన్స్ అనేది లక్ష్మీ దేవిని ఆహ్వానించేది. అందుకే ఇంటి ముందు భాగాన్ని సరిగ్గా ఉంచుకోవాలి. ఇంటి ముందు భాగం నీట్ గా ఉంటేనే ఇంట్లోని వారికి మంచి చేస్తుంది. అలాగే చాలా మంది తెలియక గుమ్మం ఎంట్రన్స్ భాగంలో కొన్ని రకాల వస్తువులు పెడుతూంటారు. ఇలాంటివి అస్సలు చేయకూడదు. గుమ్మానికి ఎదురుగా కొన్ని వస్తువులను అస్సలు..
ఇంటి ఎంట్రన్స్ అనేది లక్ష్మీ దేవిని ఆహ్వానించేది. అందుకే ఇంటి ముందు భాగాన్ని సరిగ్గా ఉంచుకోవాలి. ఇంటి ముందు భాగం నీట్ గా ఉంటేనే ఇంట్లోని వారికి మంచి చేస్తుంది. అలాగే చాలా మంది తెలియక గుమ్మం ఎంట్రన్స్ భాగంలో కొన్ని రకాల వస్తువులు పెడుతూంటారు. ఇలాంటివి అస్సలు చేయకూడదు. గుమ్మానికి ఎదురుగా కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదు. ఇలా చేస్తే నెగిటీవ్ వైబ్రేషన్స్ వస్తాయి. అలా ఇంటి ముందు భాగంలో పెట్టకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముళ్లు ఉన్న మొక్కలు:
చాలా మంది ఇంటి ముందు భాగంలో గులాభి, నాగ జెముడు, బ్రహ్మ జెముడు అలాగే కొన్ని రకాల ముళ్ల జాతికి సంబంధించి మొక్కలను పెడుతూంటారు. ఇలా అస్సలు పెట్టకూడదట. వీటిని గుమ్మం పక్కకు పెట్టుకోవచ్చు.. కానీ ఎదురుగా పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల నెగిటీవ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. అలాగే ఎండి పోయిన, వాడి పోయిన మొక్కలను కూడా ఇంటి ముందు ఆవరణలో ఉంచకపోవడమే బెటర్.
అద్దాలు లేదా గాజు వస్తువులు:
చాలా మంది ఇంటి ముందు భాగంలో అద్దాలను పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం వల్ల ఇంటికి నెగిటీవ్ వైబ్రేషన్స్ వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అద్దాలు, గాజు వస్తువులు కూడా పెట్ట కూడదు.
విరిగిన వస్తువులు:
విరిగి పోయిన వస్తువులు కూడా ఇంటి ముందు భాగంలో పెట్టకూడదు. ఇలాంటి వాటిని ఇంట్లో కూడా ఉంచకూడదు.. ఎప్పటికప్పుడు పడేయడమే బెటర్.
మారణాయుధాలు:
గుమ్మానికి ఎదురుగా మారణాయుధాలు అంటే.. గునపం, గొడ్డలి, కత్తులు, గడ్డ పారలు వంటి వాటిని ఉంచక పోవడమే బెటర్. వీటిని ఎవరూ నడవని చోట పెట్టుకోవాలి. లేదంటే ప్రమాదలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు.
చెప్పులు:
చాలా మంది చెప్పులను లేదా చెప్పుల స్టాండ్ ని గుమ్మానికి ఎదురుగా పెడుతూంటారు. అలాగే గుమ్మానికి ఎదురుగా చెప్పులను కూడా విడిచి పెడుతూంటారు. ఇలా అస్సలు చేయకూడదట. గుమ్మం పక్కకు అయినా పెట్టుకోవచ్చు కానీ.. గుమ్మం ఎదురుగా అస్సలు పెట్టకూడదట. ఇలా చేస్తే దరిద్రం వెంటాడుతుందని నిపుణులు అంటున్నారు.
చెత్తబుట్ట:
చాలా మంది తెలియక చెత్త బుట్టను గుమ్మం ఎదురుగా పెడుతూంటారు. ఇలా అస్సలు పెట్టకూడదు. ఇది నెగిటీవ్ ఎనర్జీకి దారి తీస్తుంది. కాబట్టి చెత్త బుట్టను.. గుమ్మానికి వీలైనంత దూరంగా ఉంచాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.