Vastu Tips: ఇంట్లో బీరువాను ఏ మూలకు పెడితే కలిసి వస్తుంది.. ఈ చిట్కాలు మీకోసమే!

'ధనం మూలమ్ మిదం జగత్' అనే నానుడి ఊరికే రాలేదు. డబ్బు అవసరం లేదనుకుంటాం.. కానీ ప్రస్తుతం ఇప్పుడు కాలాన్ని నడిపిస్తే డబ్బు. గౌరవం కావాలన్నా, పేరు ప్రఖ్యాతలు ఉండాలన్నా మనీ ఉంటేనే. ఇప్పుడు బంధాలు నిలబడాలన్నా డబ్బే కావాల్సి వస్తుంది. డబ్బు లేనిదే ఇప్పుడు ఏ పని అవడం లేదు. ఆ డబ్బు కోసమే ఎంతో కష్టపడి సంపాదిస్తూంటారు. కానీ ధనాన్ని నిల్వ ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు ఇంట్లో ఉండాలంటే లక్ష్మీ దేవి కటాక్షం ఉండాలి. డబ్బును..

Vastu Tips: ఇంట్లో బీరువాను ఏ మూలకు పెడితే కలిసి వస్తుంది.. ఈ చిట్కాలు మీకోసమే!
Beeruva
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 12, 2023 | 9:56 PM

‘ధనం మూలమ్ మిదం జగత్’ అనే నానుడి ఊరికే రాలేదు. డబ్బు అవసరం లేదనుకుంటాం.. కానీ ప్రస్తుతం ఇప్పుడు కాలాన్ని నడిపిస్తే డబ్బు. గౌరవం కావాలన్నా, పేరు ప్రఖ్యాతలు ఉండాలన్నా మనీ ఉంటేనే. ఇప్పుడు బంధాలు నిలబడాలన్నా డబ్బే కావాల్సి వస్తుంది. డబ్బు లేనిదే ఇప్పుడు ఏ పని అవడం లేదు. ఆ డబ్బు కోసమే ఎంతో కష్టపడి సంపాదిస్తూంటారు. కానీ ధనాన్ని నిల్వ ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు ఇంట్లో ఉండాలంటే లక్ష్మీ దేవి కటాక్షం ఉండాలి. డబ్బును ఎవరైనా ఇప్పుడు బీరువాలోనే పెడుతూంటారు. కానీ బీరువాను ఇంట్లో ఎటువైపు ఉంచితే మంచిదో ఆ విషయం మర్చి పోతారు. మనకు ఇబ్బంది లేకుండా.. ప్లేస్ ఉండేలా పెడుతూంటారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని సూచిస్తున్నారు వాస్తు నిపుణులు. వాస్తు ప్రకారం బీరువాను ఉంచినట్లైతే డబ్బుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. అసలు బీరువాను ఏ దిక్కుకి పెడితో మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తర వాయువ్యం:

చాలా మంది నైరుతి భాగంలోనే బరువును పెట్టాలని సూచిస్తూంటారు. అయితే నిజానికి ఈ దిక్కున బీరువా పెట్టకూడదట. బీరువాను ఉత్తర వాయువ్యంలో ఉంచాలి. ఎందుకంటే వాయువ్యం అనేది చంద్రుడిది. ధనానికి అధిపతి చంద్రుడు. కాబట్టి మీ బీరువాను ఉత్తర వాయువ్యంలో పెడితే మంచి ఫలితాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

దక్కిన దిక్కు:

చాలా మంది బీరువాను నైరుతి దిక్కులో ఉంచుతారు. కానీ వీటి కంటే బీరువాను తెరిచినప్పుడు ఉత్తరం వైపు చూస్తుండేలా ఉంటే చాలా మంచిది. ఈ సూచన పాటించినట్లయితే డబ్బు నష్టం జరగదు. అంతే కాకుండా ధన ప్రవాహానికి కూడా ఆటంకం ఉండదు. కాబట్టి బీరువాను ఉత్తర దిక్కున ఉంచుకోవచ్చు. అలా కుదరకపోతే.. ఉత్తర దిక్కు మధ్య కూడా ఉండొచ్చు.

ఎందుకంటే ఉత్తర దిక్కకు బుద్ధుడు అధిపతి. బీరువాను ఉత్తర దిక్కు భాగంలో ఉంచితే బెటర్. అయితే దక్షిణ ముఖం చూస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బీరువాను నైరుతి మూలలో ఉంచకూడదట. అలా చేస్తే డబ్బు నిలవదని వాస్తు శాస్త్రంలో చెబుతున్నారు.

నైరుతి మూలలో అస్సలు పెట్టకూడదు:

చాలా మంది నైరుతి మూలలో బీరువా పెడితేనే మంచిదని భావిస్తూంటారు. కానీ ఇలా అస్సలు చేయడకండి. ఎందుకుంటే వచ్చిన లక్ష్మీ దేవి వచ్చినట్టు వెళ్లిపోతుంది. అంటే ఇంట్లో డబ్బు, బంగార అనేది అస్సలు నిలవదు. దీంతో ఇబ్బందులు తప్పవట. అలాగే జీవితంలో ఆర్థిక వృద్ధి కూడా ఉండదని వాస్తు శాస్త్ర నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కడ పడితే అక్కడ డబ్బు పెట్టకూడదు:

డబ్బును నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని, నిర్దేశించిన చోటే ధనాన్ని ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. కొందరు డబ్బును మంచం మీద, బల్లపైనా, అల్మారాలో, టేబుల్ పైన ఇలా ఎక్కడ పడితే అక్కడ పెడుతూంటారు. అలాగే చాలా మంది మహిళలు తమ డబ్బును పోపు డబ్బాల్లో కూడా దాస్తూంటారు. ఇలా చేయ కూడదని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఏదో ఒక చోట మాత్రమే డబ్బును పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ