Quit Smoking: స్మోకింగ్ మానేయాలని అనుకుంటున్నారా.. అయితే ఆహారంగా ఈ పదార్థాలను తినండి!
ధూమ పానం, మధ్య పానం ఆరోగ్యానికి హాని కరం అన్న విషయం అందరికీ తెలుసు. కానీ వీటి నుంచి బయట పడాలంటే కొంచెం కష్టమే అని చెప్పవచ్చు. స్మోకింగ్ ని చాలా ఈజీగా మానేయవచ్చని అనుకుంటున్నారా.. అది మాటల వరకే పరిమితం అవుతుంది కానీ.. చేతల వరకు వెళ్లదు. స్మోకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసీ చాలా మంది మానలేకపోతున్నారు. స్మోకింగ్ చేయడం వల్ల.. బాడీలో నికోటిన్ విడుదల అవుతుంది. దీని కారణంగా క్యాన్సర్, రక్త పోటు..
ధూమ పానం, మధ్య పానం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం అందరికీ తెలుసు. కానీ వీటి నుంచి బయట పడాలంటే కొంచెం కష్టమే అని చెప్పవచ్చు. స్మోకింగ్ ని చాలా ఈజీగా మానేయవచ్చని అనుకుంటున్నారా.. అది మాటల వరకే పరిమితం అవుతుంది కానీ.. చేతల వరకు వెళ్లదు. స్మోకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసీ చాలా మంది మానలేకపోతున్నారు. స్మోకింగ్ చేయడం వల్ల.. బాడీలో నికోటిన్ విడుదల అవుతుంది. దీని కారణంగా క్యాన్సర్, రక్త పోటు, గుండె సమస్యలు, ఊపిరి తిత్తుల సమస్యలు తలెత్తుతాయి. స్మోకింగ్ చేయడం వల్ల ముఖ్యంగా శ్వాస సమస్యలు తలెత్తుతాయి. ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది. ఈ వ్యసనం నుంచి బయట పడాలంటే.. కొన్ని రకాల ఆహార పదార్థాలు బాగా హెల్ప్ చేస్తాయి. వీటిని తిడం వల్ల స్మోకింగ్ పై విరక్తిని కలిగిస్తుంది. దీంతో ధూమ పానంకు దూరంగా ఉండవచ్చు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం:
అల్లం తీసుకోవడం వల్ల నికోటిన్ కోరికలను తగ్గిస్తుంది. స్మోకింగ్ చేసే వారికి అల్లాన్ని ఇవ్వడం వల్ల ఇది ప్రభావవంతంగా పని చేసి.. ధూమ పానంకు దూరంగా ఉంచుతుంది.
నారింజ:
నారింజ మన శరీరంలో నుండి నికోటిన్ ను బయటకు పంపించడానికి హెల్ప్ చేస్తుంది. అంతే కాదు దీని వల్ల విటమిన్ సీ కూడా బాగా అందుతుంది. కాబట్టి ధూమ పానం చేసే వారు తరుచుగా తీసుకుంటే స్మోకింగ్ కు దూరంగా ఉండ వచ్చు.
క్యారెట్:
క్యారెట్ లో ఉండే ఎ, బి, సి, కె వంటి విటమిన్లు శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ ని పెంచుతుంది. అలాగే స్మోకింగ్ వల్ల నరాలు, చర్మం దెబ్బతినకుండా ఉండేలా చేస్తుంది.
బ్రోకలీ:
బ్రోకలీలో ఉండే విటమిన్ బీ5, సి లు శరీరంలో రోగ నిరోధక శక్తిని, జీవ క్రియను పెంచుతుంది. అలాగే శరీరం నుండి నికోటిన్ కూడా బయటకు పంపిస్తుంది. ముఖ్యంగా బ్రోకలీ పెద్ద ప్రేగు ద్వారా వచ్చే క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది.
ఆకు కూరలు:
ఆకు కూరల్లో ఉండే ఫోలిక్ యాసిడ్, విటమిన్లు, పోషకాలు నికోటిన్ ఉప సంహరణ లక్షణానలను ఎదుర్కొనడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే నికోటిన్ బాడీ నుంచి బయటకు పంపుతుంది.
ఆపిల్:
క్రమం తప్పకుండా ఆపిల్ తింటే.. స్మోకింగ్ అలవాటు దూరం అవుతుంది. యాపిల్ లో ఉండే ప్రాక్టిన్.. బ్లడ టాక్సిన్ కంటెంట్ ని తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇతర వ్యాధులకు కూడా దూరంగా ఉండవచ్చు.
దానిమ్మ:
దానిమ్మ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు.. బాడీ నుంచి టాక్సిన్స్ ను బయటకు పంపించడంలో బాగా సహకరిస్తుంది. అంతే కాకుండా స్మోకింగ్ చేయడం వల్ల తగ్గిన ఎర్ర రక్త కణాల సంఖ్యను కూడా మెరుగు పరుస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.